BSNL: ప్రస్తుతం టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలు సగటు కస్టమర్ ని ఏ విధంగా బాధిస్తున్నాయా తెలియంది కాదు. పెరిగిపోయిన రీఛార్జ్ ధరలు సామాన్యులకి పెను భారంగా మారాయి. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి BSNL యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్ను ఇపుడు తీసుకు వచ్చింది. ఏ టెలికాం కంపెనీ ఆఫర్ చేయని ప్లాన్ను BSNL తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. కొత్త యూజర్లని ఆకర్షించేలా ఈ ప్లాన్ వుంది.
Dry Hair: జుట్టు రఫ్ గా ఉందా..!? ఆలివ్ ఆయిల్ లో ఇది కలిపి రాయండి..!
BSNL: ఆ తాజా సరికొత్త ప్లాన్ ఇదే..
పాత యూజర్లను మెంటైన్ చేసేలా, కొత్త యూజర్లని ఆకట్టుకోవడం కోసం అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీను అందించే ప్లాన్ను BSNL తీసుకు వచ్చింది. కేవలం రూ.197 పెట్టి రీచార్జ్ చేస్తే ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీను ఎంజాయ్ చేయవచ్చు. అంతే కాకుండా రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఆఫర్ చేస్తుంది BSNL. కాగా ఈ ప్రయోజనాలు మాత్రం కేవలం 18 రోజులు మాత్రమే పొందే వీలు ఉంటుంది. సుదీర్ఘ వ్యాలిడిటీ అందించమే లక్ష్యంగా BSNL ఈ సరికొత్త ప్లాన్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
Samata Murthy: సమతామూర్తి విగ్రహంపై స్పందించిన రాహుల్ గాంధీ.. మోడీపై ఇండైరెక్ట్ కామెంట్స్
18 రోజుల తర్వాత?
18 రోజుల తర్వాత ఏమిటి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కూడా ఎలాంటి టాప్అప్ వేయకపోయినా ఉచిత ఇన్కమింగ్ సౌకర్యాన్ని పొందే వెసులుబాటు కల్పిస్తోంది BSNL. అంతేకాకుండా 40kbps వేగంతో ఇంటర్నెట్ను కూడా యూజర్స్ పొందవచ్చును. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన నేపథ్యంలో ఎవరన్నా నెట్ వర్క్ ఫెసిలిటీని బట్టి ఈ BSNL అప్షన్ ను ఎంచుకోవచ్చు.