Indian Railways: అదనపు ఆదాయానికి రైల్వేశాఖ ఎస్డీఎఫ్ పేరుతో కొత్త లెక్క….ప్రయాణికుడి జేబుకు బొక్క!

Share

Indian Railways: అటు కేంద్రం ..ఇటు రాష్ట్రం కూడా ప్రజలను దొంగదెబ్బతీసే పనిలోనే ఉన్నాయి.అదనపు ఆదాయం కోసం పాలకులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ముందుగా రాష్ట్రం విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో చెత్త పై కూడా పన్ను విధించటం విదితమే.

New calculation in the name of Railways SDF for extra income
New calculation in the name of Railways SDF for extra income

ప్రతి ఇంటి నుండి పట్టణాల్లో వంద రూపాయల చొప్పున చెత్త పన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఆ పనిలో మున్సిపాలిటీలు ఉన్నాయి.అంతేగాక పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఇళ్ల పన్నులను కూడా పెంచుకుంటూ పోతున్నారు.అంతటితో ఆగకుండా దొడ్డిదారిన విద్యుత్ ఛార్జీలను,వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను జగన్ ప్రభుత్వం పెంచింది.దీంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.

కేంద్రం కూడా తక్కువేమీ తినలేదు!

ఇక కేంద్రం జీఎస్టీ పేరుతో సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది.చివరికి చెప్పులపై కూడా జీఎస్టీని పెంచిన ఘనత కేంద్రానిదే.అంతేగాక వస్త్రాలపై కూడా జీఎస్టీని అయిదు నుండి పన్నెండు శాతానికి పెంచారు.తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచారు.ఇప్పుడు కేంద్రం రైలు ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. వారి నుండి అదనపు ఆదాయం ఎలా పొందాలన్న విషయమై కసరత్తు చేసి స్టేషన్ల డెవలప్మెంట్ ఫీజు అనే కొత్త మార్గాన్ని కనిపెట్టింది.

Indian Railways: స్టేషన్ల డెవలప్మెంట్ ఫీజు(ఎస్డీఎఫ్) ఏమిటంటే?

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో, విమానాశ్రయాలను తలపించే మాదిరిగా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. ఈ పనుల కాంట్రాక్టులను ప్రైవేట్ సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్నింటి అభివృద్ధి పూర్తి కాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి రైలు ఎక్కి వెళ్లే వారు.. అలాగే ఈ స్టేషన్లలో రైలు దిగే వారి నుంచి ఎస్డీఎఫ్ ను రైల్వే శాఖ వసూలు చేయనుంది. రూ.10 నుంచి రూ.50 వరకు ఈ చార్జీ పడనుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఈ చార్జీ సైతం కలసిపోతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపి నోటిఫై చేసింది.తొలి దశలో దేశవ్యాప్తంగా యాభై రైల్వేస్టేషన్లలో ఈ ఫీజు వసూలు చేస్తారు.

Indian Railways: నెల్లూరు, తిరుపతిలలో ఎస్డీఎఫ్!

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 21, తెలంగాణలో 8 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం ఈ స్టేషన్లలో ఇకపై ఎస్డీఎఫ్ వసూలు చేస్తారు.అయితే ఏ స్టేషన్లలో వసూలు చేస్తారు అన్న విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.తొలిదశలో నెల్లూరు తిరుపతి సికింద్రాబాదుల్లో ఎస్డీఎఫ్ వసూలు చేసే అవకాశం ఉంది.ఇలాంటి స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ ధర కూడా రెట్టింపు చేయబోతున్నారు.ఏదేమైనా ఇకపై రైలు ప్రయాణం సామాన్యుడికి చుక్కలు చూపబోతోంది.

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన పింకీ..!!

sekhar

బిగ్ టర్న్ : జగన్ – కే‌సి‌ఆర్ కలిసి ప్రెస్ మీట్ ?? 

siddhu

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో వరుణ్ సందేశ్, వితికా సందడి

Varun G