Indian army:చాట్ యాప్స్ గురించి మనకు బాగా తెలుసు. వాటిలో వాట్సాప్ యెంత ఫేమస్ అయ్యిందో కూడా తెలుసు. ఇకపోతే సరిగ్గా ఇలాంటి యాప్ మన భారత సైన్యం రూపొందించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్ (ASIGMA) గా పిలిచే ఒక మెసేజింగ్ యాప్‌ను ప్రారంభించినట్లు ఇండియన్ ఆర్మీ తాజాగా ప్రకటించింది. దీన్ని అత్యాధునిక, న్యూ జనరేషన్, వెబ్ ఆధారిత అప్లికేషన్‌గా భారత సైన్యం చెప్పుకొచ్చింది.
ఈ యాప్ కేవలం ఆర్మీకేనా లేదంటే పబ్లిక్ కోసమా?
ఇది పబ్లిక్ కోసం కాదు. కేవలం ఆర్మీ తదితర గ్రూప్స్ కోసమే లంచ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అప్లికేషన్ అభివృద్ధిలో బయట వ్యక్తుల సహాయం ఇండియన్ ఆర్మీ తీసుకోలేదు. కమ్యూనికేషన్లను హ్యాండిల్ చేసే ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ బృందం ఈ యాప్‌ను క్రియేట్ చేసి డెవలప్ చేసింది. PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) లోని ఒక పోస్ట్ ప్రకారం, ఆర్మీకి చెందిన ఇంటర్నల్ నెట్‌వర్క్‌లో AWAN (ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్) మెసేజింగ్ యాప్‌కు బదులుగా ASIGMA (అసిగ్మా) అప్లికేషన్ని వినియోగించడం ప్రారంభించింది.
ఇది వారికి ఏ విధంగా ఉపయోగ పడనుంది?
ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమంటే.. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ వంటి యాప్ స్టోర్లలో దొరకదు. ఇది ASIGMA యాప్ ఆర్మీ యాజమాన్యంలోని హార్డ్‌వేర్‌తో ఫీల్డ్ అయి ఉంటుంది. ఇది ఫీచర్ అప్‌గ్రేడ్‌లకు లైఫ్ టైమ్ సపోర్ట్ అందించనుంది. ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం సెక్యూర్ మెసేజింగ్ నెట్వర్క్ అందిస్తుందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ప్రైవసీ తదితర సమస్యలు ఉన్న వాట్సాప్, సిగ్నల్ వంటి అవుట్ సైడ్ మెసేజింగ్ యాప్స్‌పై ఆధారపడకూడదని ఇండియన్ ఆర్మీ అలోచించి దీన్ని రూపొందించింది.