ట్రెండింగ్ న్యూస్

Rechipodam Brother : త్వరలో ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్ షో.. రాజీవ్ కనకాల హోస్ట్?

Rechipodam Brother : త్వరలో ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్ షో.. రాజీవ్ కనకాల హోస్ట్?
Share

Rechipodam Brother : రెచ్చిపోదాం బ్రదర్ Rechipodam Brother అనే కొత్త షో త్వరలో ఈటీవీ ప్లస్ లో ప్రారంభం కాబోతోంది. ఈ షోకు హోస్ట్ ఎవరో తెలుసా? మన రాజీవ్ కనకాల. ఇన్ని రోజులు సినిమాల్లో కనిపించిన రాజీవ్ కనకాల ఇక బుల్లితెర మీద కనువిందు చేయనున్నారన్నమాట.

New comedy show Rechipodam brother in etv plus
New comedy show Rechipodam brother in etv plus

రాజీవ్ కనకాల భార్య సుమ కూడా తెలుగులో పెద్ద యాంకర్. ఆమెతో పాటే రాజీవ్ కూడా బుల్లితెరను ఏలేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఈమధ్య పలు షోలలో దర్శనమిస్తున్నారు రాజీవ్.

Rechipodam Brother : కామెడీ షోలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఈటీవీ

ఈమధ్య కామెడీ షోలకు ఈటీవీ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో కామెడీని పంచుతున్న ఈటీవీ.. ఈ మధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షోను నిర్వహిస్తోంది. అది కూడా ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ షోనే.

మళ్లీ రెచ్చిపోదాం బ్రదర్ అనే మరో సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ షోను ఈటీవీ ప్లస్ లో ప్రారంభించనుంది. ఈ షోలో చాలామంది జబర్దస్త్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఈ షోకు రాజీవ్ కనకాల హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు మేఘన అనే ఓ అమ్మాయి కోహోస్ట్ గా వ్యవహరించనుంది.

మొత్తానికి రాజీవ్ కనకాల రెచ్చిపోదాం బ్రదర్ అని అంటున్నారు.. చూద్దాం మరి.. ఈ షో ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?

 


Share

Related posts

Breaking : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – కాలువలోకి దూసుకువెళ్లిన బస్సు..32 మంది మృతి

somaraju sharma

Shriya Saran Gorgeous Photos

Gallery Desk

మళ్లీ యాక్టివ్ అవుతున్న వంగవీటి రాధా..??

sekhar