NewsOrbit
న్యూస్

పాలనలో భారీ మార్పులు..! కొత్త కమీషనరేట్లు.., ఆపై కొత్త జిల్లాలు..!!

 

 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి. జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజన కసరత్తులో భాగంగా రాష్ట్రంలో పోలీసుశాఖను 29 యూనిట్లుగా విభజించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో 5 కొత్త కమిషనరేట్లు ఉండనున్నాయి.

 

ap cm

జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లాల్లో ఉద్యోగులు ఎందరు? ఏయే హోదాల్లో పని చేస్తున్నారు? సొంత భవనాలు ఎన్ని? అద్దె భవనాల్లో ఎన్ని.. తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీసుశాఖా కొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన భవనాల కోసం వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు లేకపోతే తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో నివేదికలు రూపొందిస్తున్నారు.

 

ap police commissionarates

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో భారీగా మారుపులు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 పోలీస్ కమిషనరేట్లు ఉండగా, పోలీసు యూనిట్ల పునర్నిర్మాణంలో భాగంగా, పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 5 కమిషనరేట్లు ఏర్పాడనున్నాయి. ఎక్కువగా అర్బన్ ప్రాంతంలోనే కొత్త కమిషనరేట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం సర్కిల్ గా కొనసాగుతున్న ఎస్పీ కార్యాలయాల స్థాయిని కమిషనరేట్ కార్యాలయాలు గా బదలాయిస్తారు అంటున్నారు. పోలీస్ వర్గాల విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం కొత్తగా తిరుపతి అర్బన్, నెల్లూరు అర్బన్, గుంటూరు అర్బన్, రాజమండ్రి అర్బన్, కాకినాడ అర్బన్ పరిధిని కమిషనరేట్ స్థాయికి పెంచనున్నారు అన్ని తెలుస్తుంది. కొత్త కమిషనరేట్లకు కమిషనర్లుగా డిఐజి స్థాయి అధికారులను నియమించనున్నారు. తిరుపతి కమిషనరేట్ పరిధిలో తిరుపతి , శ్రీ కాళహస్తి ఉంటాయి. నెల్లూరు కమిషనరేట్ పరిధిలో కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రురల్ ఉండనున్నాయి. గుంటూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాడికొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, పశ్చిమ గుంటూరు, తూర్పు గుంటూరు ఉంటాయి. రాజమండ్రి కమిషనరేట్ పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగర్, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం. కాకినాడ కమిషనరేట్ పరిధి లో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని, పిఠాపురం ఉంటాయి. ఇది ఇలా ఉంటె విజయవాడ కమిషనరేట్ పరిధి లో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్ లు కృష్ణ జిల్లా లో కలుస్తాయి. అలాగే కృష్ణ జిల్లా లో ఉన్న నందిగామ, నూజివీడు కలుస్తాయి. అనకాపల్లి, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. విశాఖపట్నంను మూడు జిల్లాలుగా విభజించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖాపరంగా చేపట్టాల్సిన ఇతరత్రా మార్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిచనున్నారు. కొన్నిచోట్ల జిల్లాల మౌలిక స్వరూపాన్ని బట్టి కొత్తగా యూనిట్లు నెలకొల్పాలని ప్రతిపాదించగా.. మరికొన్ని చోట్ల నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు.జిల్లాల భౌగోళిక సరిహద్దులు, నియంత్రణ, న్యాయపరమైన వ్యవహారాల అధ్యయనానికి కమిటీ, జిల్లా నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ వంటి నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.

పోలీస్ యూనిట్స్:
ఇంకా రాష్ట్రం లో ప్రస్తుతం 18 పోలీస్ యూనిట్ లు ఉండగ్గా, వాటిని 29 పోలీస్ యూనిట్లుగా చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కారణంగానే ఏపీ పోలీస్ శాఖలో బదిలీలు కూడా జరగలేదు. ప్రతి పాదనలు కార్యరూపం దాల్చితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అరకు, అనకాపల్లి, రంపచోడవరం, అమలాపురం, ఏల్లూరు, నర్సాపురం, మచిలీపట్టణం, నర్సారావు పేట, బాపట్ల,ఒంగోలు, రాజంపేట, కడప, హిందూపురం, అనంతపురం, నంద్యాల, కర్నూల్ జిల్లా స్థాయిలో పోలీస్ యూనిట్లుగా ఏర్పాడే అవకాశం ఉంది.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju