NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వెంకన్నతో ఆటలొద్దు జగన్ : శ్రీరంగంకి తిరుమలకు పోలిక ఎలా?

శ్రీరంగం… తిరుమల రెండూ ఒకటేనా? ఎందుకు ఇప్పుడు శ్రీరంగంతో తిరుమలను పోలుస్తున్నారు. అక్కడ జరిగినట్లుగా తిరుమలలో జరగాలని టీటీడీ పాలకమండలి రూపొందిస్తున్న వింత వైఖరి ఏమిటి… టీటీడీ అధికారులు తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు ఇప్పుడు తిరుమలలో హాట్ టాపిక్.

తిరుమల, శ్రీరంగం రెండూ వైష్ణవ ఆలయాలు. ప్రసిద్ధి చెందినవి. అయితే రెండు ఆలయాలకు పూజలు కైంకర్యాలు సేవల విషయంలో పూర్తి తేడా ఉంటుంది. శ్రీరంగంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు జరిగితే, తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం మాత్రమే పూజలు జరుగుతాయి. మరే ఇతర సంప్రదాయాన్ని, పూజలను తిరుమలలో జరపరు. ఆగమశాస్త్రం లో ఉన్న దాని ప్రకారమే పొల్లుపోకుండా సేవలు జరుగుతాయి. అలాగే స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాల విషయంలోనూ ఆగమశాస్త్ర మే సూచి. అయితే ఇప్పుడు ఆగమశాస్త్రం విరుద్ధంగా, అనాదిగా వస్తున్న సంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మంగళంపాడు తోంది. వైకుంఠ ఏకాదశి కి ఏకంగా పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఇప్పుడు చెప్పడం, దానికి శ్రీరంగం ఉదాహరణగా పేర్కొనడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఎప్పుడూ లేని ఈ వింత వైఖరిపట్ల శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట పది రోజులు తెరుస్తారు అన్నది జనం వస్తున్నారని… తర్వాత సంవత్సరమంతా తెరుస్తారా అంటూ హిందూ పీఠాధిపతులు మండిపడుతున్నారు. ఈ కీలక సమయంలో దీన్ని ఎలాగైనా రాజకీయం చేసేందుకు బిజెపి ఆలోచిస్తుంటే, వైకుంఠ ద్వార దర్శనం పదిరోజులు సరికాదని ఆగమశాస్త్రం ప్రకారం రెండు రోజులు ద్వాదశి ఏకాదశి రోజుల్లో మాత్రమే తెరిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. టీటీడీ బోర్డు ఒంటెత్తు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకీ వింత నిర్ణయాలు?

శ్రీరామానుజుల వారు స్వయంభూగా వెలిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాన్ని రూపొందించి దాని ప్రకారమే పూజలు చేయాలని సూచించారు. అనాదిగా ఇదే సంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. దీనికోసం తిరుమలలో ఆగమ సలహామండలి పనిచేస్తోంది. ఎనిమిది మంది సభ్యులు ఆగమ సలహా మండలిలో ఉంటారు. వేదాలు ఉపనిషత్తులు ఆగమశాస్త్రం పై పూర్తి పట్టు వీరంతా ఆలయంలో జరిగే అన్ని విషయాలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షిస్తారు. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది ఆగమశాస్త్రం ప్రకారం ఉందా లేదా చూసి దీని ప్రకారం అధికారులకు తగు సూచనలు ఇస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం కంకరియా లు సేవలు జరుగుతున్నాయా అని దగ్గరుండి చూసేందుకు, స్వామివారి కైంకర్యాలను ఏ ప్రకారం నిర్వహించాలో చూసేందుకు జియ్యంగార్లు ఉన్నారు. పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యగార్లతో పాటు కైంకర్యాలను పర్యవేక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వీరికి జీతాలు చెల్లిస్తూ మరి స్వామి సేవకు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ కాదని ఇప్పుడు తిరుమల అధికారులు సొంత ప్రాపకం కోసం కొత్త నిర్ణయాలు తీసుకోవడం తిరుమలలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. గతంలోనూ కొందరు అధికారులు తమ సొంత మార్పు కోసం లఘు మహాలఘు దర్శనాన్ని అమలు చేసి సామాన్య భక్తుడికి శ్రీవారిని దూరం చేశారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు మారినప్పుడల్లా నిర్ణయాలు మారితే ఆగమశాస్త్రం ఇంకెందుకు అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

కరోనా వేళ అవసరమా?

కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గలేదు. కరోనా ఇంకా నియంత్రణలోకి రాలేదు. ఈ కారణంతోనే రెండు బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే ఏకాంతగా చేశారు. కనీసం చక్రస్నానం సైతం పుష్కరిణీ వద్దకు రాకుండా లోపలి ప్రత్యేకమైన రొట్టెను ఉపయోగించి నిర్వహించారు. అలాంటిది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు తండోపతండాలుగా వస్తారు అని భావించి పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరవడం ఏమాత్రం సముచితమైన నిర్ణయం కాదు. వచ్చే భక్తులు ని ఎలా కంట్రోల్ చేస్తారు… వారికి అన్ని రోజులు ఎలాంటి వసతులు కల్పిస్తారు అనేది ప్రశ్న. వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో తిరుమలలో సుమారు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది వస్తుంటారు. 24 గంటలు దర్శనం ఉంటుంది. అయితే ప్రస్తుత కరుణ సమయంలో కొండపైకి ఎంతమందిని పరువు తీస్తారు దర్శనాలు ఎవరికి కల్పిస్తారు అనేదానిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుతుంది అనేది కొత్త వివాదానికి దారి తీయవచ్చు. అయితే టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం అనుమతిస్తుంది లేక పెండింగ్లో పెడుతుందా అనేది చూడాలి. గత సంవత్సరం సైతం వైకుంఠ ద్వారాలు పదిరోజులు చేరుస్తామని ముందుగా ప్రకటించి, భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దానిని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ అదే నిర్ణయాన్ని టిటిడి బోర్డు ఇప్పుడు కావాలని తెరపైకి తెచ్చిందని, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తప్ప ఇంకేమీ ఉండదని వైఎస్ఆర్ సిపి నేతలు హెచ్చరిస్తున్నారు.

author avatar
Special Bureau

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju