Maa: ఇండస్ట్రీ సంచలనం.. “మా” అధ్యక్షుడిగా తెరపైకి బాలయ్య బాబు..!!

Share

Maa: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. “మా” అధ్యక్ష పదవి కోసం దాదాపు ఐదు మంది సభ్యులు పోటీపడుతున్నారు. గతంలో కేవలం ఇద్దరు మాత్రమే పోటీపడే పరిస్థితి.., కానీ ఈ సారి ఇప్పుడు ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగటంతో… ఇండస్ట్రీ లో వాతావరణం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా “మా” అసోసియేషన్ ఏర్పడి చాలా సంవత్సరాలు అయినా గాని ఇప్పటివరకు “మా” కి శాశ్వత భవనం లేకపోవడం పట్ల చాలామంది అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

Balakrishna & Manchu Vishnu Kulaanubandham Rocks!

మూవీ అసోసియేషన్ కి వచ్చిన విరాళాలను ఏం చేశారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో అధ్యక్ష పదవి కోసం జరగబోయే పోటీ ఎన్నికలలో.. ఒక పోటీదారుడు మంచు విష్ణు.. నాకు అవకాశం కల్పిస్తే మా కి తన సొంత డబ్బులతో అధ్యక్ష భవనం కట్టిస్తాం అని ఇటీవల హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా మా అధ్యక్ష పదవిని బాలకృష్ణ అధిరోహించాలని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More: MAA Elections: రాజకీయాలకు మించిన సినిమా..!? మా కు బుద్దిలేదేమో..!?

గతంలో తాను ఇచ్చిన శాశ్వత భవనం హామీకి బాలకృష్ణ మద్దతు తెలపడం మాత్రమే కాక తాను కూడా విరాళాలు అందిస్తానని తెలపటంతో మంచు విష్ణు స్పందించారు. ఇటీవల ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు మద్దతు తెలిపిన బాలకృష్ణ కి కృతజ్ఞతలు తెలుపుతూ మా అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా సినీ ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావాలని సూచించారు. ఇదే సమయంలో నా అధ్యక్ష పదవిని నందమూరి బాలయ్య బాబు అందుకుంటే చూడాలని ఉందని ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని.. ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.


Share

Related posts

Chandrababu: చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగిపోయేలా జ‌గ‌న్ కోసం వాళ్లు ఏం చేశారంటే…

sridhar

APSRTC : లీడర్ అంటే ఇలా ఉండాలి..! ఏపీ ఆర్టీసీ వారికి చుక్కలు చూపించిన మంత్రి నాని….

siddhu

CM YS Jagan: జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్ అందించిన కేంద్రం..! అది ఏమిటంటే..?

somaraju sharma