NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

North Korea: ఉత్తర కొరియాలో కరోనాతో పాటు కొత్త వ్యాధి..!!

North Korea: ప్రపంచంలో కరోనా విలయతాండవం సృష్టించిన ప్రారంభంలో ఉత్తర కొరియా లో ఒక్క కరోనా కేసు బయటపడలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా సాధారణ స్థితిలో ఉన్న సమయంలో… ఉత్తర కొరియా మాత్రం మహమ్మారి ధాటికి  దడ దడ లాడుతోంది. ఏకంగా రోజుకి 50 వేల కేసులు నమోదవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. చాలావరకు లక్షణాలు జ్వరంతో పాటు దగ్గు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో మొత్తం కేసుల సంఖ్య నలభై లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కరోనాతో పాటు మరో కొత్త అంటువ్యాధి ఉత్తర కొరియా దేశాన్ని ఒణికిస్తోంది.

New disease along with corona in North Korea

మేటర్ లోకి వెళితే ఉత్తర కొరియా దేశంలో ఓడరేవు నగరమైన హేజులో అంతుచిక్కని ఒక విచిత్రమైన అంటు వ్యాదితో ప్రజలు బాధపడుతున్నారు. పేగు సంబంధిత వ్యాధి తరహాలో వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య మాత్రం బయటకు రానివ్వకుండా అక్కడి అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఒక మరో వైరస్ అయితే మిగతా ప్రపంచ దేశాలకు పెను ప్రమాదమే అని తాజా వార్తల పై మిగతా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ అరికట్టే విషయంలో చైనా దేశానికి సరిహద్దు ప్రాంతాలలో ఉత్తరకొరియా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. చైనా సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ప్రజలు తలుపులు, కిటికీలు మూసి వేయాలని… తెరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంట. ఉత్తర కొరియా తో పాటు చైనాలో కొన్ని ప్రాంతాలలో వైరస్ భారీ ఎత్తున విజృంభిస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. దీనికి తోడు కొత్త అంటువ్యాధి బయటపడటంతో.. అక్కడ ప్రభుత్వ అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?