NewsOrbit
న్యూస్

నిమ్మగడ్డ స్థానే మన్మోహన్… జగన్ లాజిక్ ఇదే?

ప్రస్తుతం ఏపీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే.. అది కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారమనే చెప్పాలి! రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ వ్యవహారంపై ఇక క్లారిటీ తెచ్చుకునే పనికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ను కమిషనర్‌ గా పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లి ఆ విషయాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టిన జగన్ సర్కార్… సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందని ఆశిస్తోంది. నిజంగా జగన్ ఆశించినట్లు అదే జరిగితే.. కొత్త కమిషనర్‌ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ ను నియమించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీకి ఎన్నికల కమిషనర్ ఉన్నట్లా. లేనట్లా అనే అనుమానం అందరికీ ఉంది! రమేశ్ కుమార్ ను పునర్నియమించడం జగన్ కు ఇష్టం లేదు.. జగన్ నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ ను హైకోర్టు వద్దంది! దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో… స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడం, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి.. వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని కమిషనర్‌ గా నియమించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా హైకోర్టు ఓ తీర్పు వెలువరించి.. ఇన్ని రోజుల్లో అమలు చేయాలని తీర్పులో చెప్పని పక్షంలో ఆ తీర్పు అమలుకు 2 నెలల వ్యవధి ఉంటుందని అడ్వకేట్‌ జనరల్‌ చెబుతున్న పరిస్థితుల్లో… నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదనే అనుకోవాలి. ఇదే సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవి కూడా ఖాళీగా ఉండకూడదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలని వాదన వినిపించడం.. దానికి తగ్గట్లుగా పంచాయతీరాజ్‌ చట్టంలో అలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో కమిషనర్‌ పోస్టు ఖాళీ అయితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చట్టాన్ని సవరించి.. తద్వారా మరో ఆర్డినెన్స్‌ జారీచేసి.. దాని ప్రకారం మన్మోహన్‌ ను నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నాయంట! ఇదే జరిగితే నిమ్మగడ్డ స్థానే మన్మోహన్ వస్తారన్నమాట!

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?