NewsOrbit
న్యూస్

వైయస్సార్ బ్యాచ్ సపరేట్ ..న్యూ ఎనర్జిటిక్ బ్యాచ్ తో రంగంలోకి జగన్!

జగన్ తనదైన టీం సెట్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల మీద చూపుతోనే జగన్ తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. ఆయన 2024 నాటికి సీనియర్లకు ఎవరికీ టికెట్ ఇవ్వబోరని కూడా అంటున్నారు. అదే విధంగా పార్టీకి కట్టుబడి ఉండకుండా కాంగ్రెస్ కల్చర్ తో హల్ చల్ చేద్దామనుకునేవారికి కూడా గట్టిగా చెక్ పెడతారు అంటున్నారు.

జగన్ తన టీం ని సెట్ చేసుకున్నారని, అలాగే కొత్తవారు, తనకూ, పార్టీకి బద్ధులై పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందువల్ల అరచి గీ పెట్టినా అసంతృప్తి నేతల గోడు అరణ్య రోదనేనని అంటున్నారు. ఓ విధంగా వైసీపీలో వారి రాజకీయం దాదాపుగా ముగిసినట్లేనని కూడా అంటున్నారు.ఆయన తన తండ్రి హయాంలో పనిచేసిన వారిలో కొందరికే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన వారిలో తనతో పదేళ్ళుగా రాజకీయం చేసిన వారినే తీసుకున్నారు. ఇందులో కూడా నమ్మకస్తులను దగ్గరపెట్టుకున్నారు.

ఇక వారంతా జగన్ ఏజ్ గ్రూప్ వారు, ఇంకా తక్కువ వయసు వారే ఉండేలా చూసుకున్నారు. చంద్రబాబు మంత్రివర్గంతో పోలిస్తే జగన్ మంత్రివర్గంలో యంగ్ స్టర్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఇదీ తన విధానం అని జగన్ చెప్పేశాక కూడా అసమ్మతి పేరిట మూలుగుతూ, రాగాలు పెడుతున్న సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ భవిష్యత్తుకు తామే చేటు తెచ్చుకుంటున్నారని అంటున్నారు.జగన్ పుణ్యమాని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చిన వీరంతా ఇపుడు అసంతృప్తి పేరిట రచ్చ చేస్తే జగన్ మూడవ కన్నే తెరుస్తారని అంటున్నారు.జగన్ 2019లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కొన్ని నిబంధనలు సడలించుకున్నారు.

2019 ఎన్నికల్లో ప్రతీ ఒక్క సీటు తనకు ముఖ్యం కాబట్టి యువతరంతో పాటు సీనియర్లకు కూడా కొంత పెద్ద పీట వేశారు. అయితే ప్రజలు దయతలచి బంపర్ మెజారిటీ ఇవ్వడంతో మంత్రివర్గాన్ని మాత్రం జగన్ తాను అనుకున్న మేరకు యువ కూర్పుతోనే జాగ్రత్తగా చేసిపెట్టుకున్నారు. తన తండ్రి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి మాత్రమే జగన్ చోటిచ్చారు. ఇక ఇందులో పిల్లి, మోపిదేవి రాజ్యసభకు వెళ్తున్నారు కాబట్టి ఆ సంఖ్య మరింత తగ్గుతుంది.వైసీపీలో యువత కే అధిక ప్రాధాన్యం లభించబోతోంది.





author avatar
Yandamuri

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N