What’s up: ప్రస్తుత ప్రపంచంలో వాట్సాప్ అంటే తెలియని వారు ఉండరంటే నమ్మశక్యం కాదేమో! అంతలా మార్కెట్లోకి ఇది దూసుకు వెళ్లిపోయింది. దానికి ఏకైక కారణం.. యూజర్ ఫ్రెండ్లీనే. ప్రస్తుత లెక్కల ప్రకారం స్మార్ట్ ఫోన్ వున్న ప్రతీ ఒక్కరు దీన్ని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. యూజర్ కి అనుగుణంగానే వాట్సాప్ ఫీచర్స్ అప్ డేట్ అవుతూ, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అందువలనే ఇక్కడ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే మరలా దాన్ని అన్ ఇన్స్టాల్ చేసుకొనే ప్రసక్తే ఉండదు.
NOVEMBER: నవంబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి అమలవ్వబోతున్న కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సినవి..!
కొత్త ఫీచర్ వివరాలు:
ఇకపోతే చాలా సోషల్ మీడియా కంపనీలు యూజర్స్ డేటా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసినదే. అందులో ఈ వాట్సాప్ కూడా వుంది. అందువలనే ముఖ్యంగా ఈ గోప్యత విషయంలో వీరు చాలా ఎలర్ట్ గా వుంటారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వుంటారు. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అనేదాన్ని అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించనుంది. దీన్ని ఎలా వాడాలో ఇపుడు తెలుసుకుందాం…
What’s up: వాట్సప్ లో ఇలాంటి మెసేజ్ లకు రిప్లై ఇచ్చరా…ఇంకా అంతే సంగతి …!
ఆ ఆప్షన్లు ఎక్కడ చూడవచ్చు?
ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, iOS రెండు డివైజ్ల్లోనూ అప్ డేట్ చేసింది వాట్సాప్ కంపెనీ. యావత్ వాట్సాప్ యూజర్లు అందరూ ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికోసం మనం చేయవలసిందల్లా ఒక్కటే. మనం మన వాట్సాప్ అప్ డేట్ చేసుకుంటే సరి. ఫీచర్ దానంతట అదే అప్ డేట్ అయిపోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, తమ ప్రైవసీని ఎవరికి కనిపించకుండా ఉండేందుకు వీలుగా Last Seen Time, Online అనే రెండు ఆప్షన్లు దీని ద్వారా హైడ్ చేసుకొనే వీలుంది. కేవలం యూజర్ల ప్రైవసీ ఉద్దేశంతోనే వాట్సాప్ ఈ కొత్త ప్రైవసీ అప్ డేట్ తీసుకొచ్చినట్టు వాట్సాప్ ట్రాకర్ అయినటువంటి WABetaInfo వెల్లడించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?