Instagram: ఇన్స్టాగ్రామ్ పరిచయం అక్కర్లేదేమో. యావత్ ప్రపంచంలోనే మంచి క్రేజ్ వున్న సోషల్ మీడియా యాప్ ఇది. అలాగే అత్యధిక యూజర్లు కూడా దీనికే వున్నారు. దానికి తగ్గట్టే వారు ఎప్పటికప్పుడు కొత్త రకమైన అప్డేట్స్ తెస్తూ యూజర్స్ ని సంతృప్తి పరుస్తూ వుంటారు. ఈ క్రమంలోనే ఓ కొత్త అప్ డేట్ వచ్చి చేరింది. ముఖ్యంగా యూజర్ల డేటా భద్రతే భాగంగా ఈ అప్ డేట్ పనిచేయనుంది. మనకు తెలుసు.. ఈ మధ్య కాలంలో గాని చూసుకుంటే భద్రతా విషయంలో పెద్ద పెద్ద చర్చలే నడుస్తున్నాయి. సదరు కంపెనీలకు ప్రభుత్వాలు గట్టిగానే మొట్టికాయలు వేస్తున్నాయి.
Instagram: ఇంస్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్..??
అప్డేట్ వివరాలు ఇవిగో…
దీనిలో ఉండే స్టోరీస్ ప్లాట్‌ఫాంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం 24 గంటల వరకు కనిపించే ఈ స్టోరీస్ యువతకు తెగ నచ్చేశాయి. ఈ నేపథ్యంలో దానిని మరింత ఆకర్షణీయంగా రూపు దిద్దడానికి ఇన్‌స్టా మేకర్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు 15 సెకండ్ల వరకు మాత్రమే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వీడియో చేసుకునే వీలుంది. ఇపుడు ఈ నివిడిని 60 సెకండ్ల వరకు పెంచనుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌కు స్నాప్‌చాట్, టిక్‌టాక్ ల నుంచి విపరీతమైన పోటీ రావడం వలన ఈ నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం.
Instagram: ఇంస్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్..??
ఎప్పటినుండి ఇది అందుబాటులోకి రానుంది?
అతి తర్వలోనే ఇది యూజర్స్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయమై యూజర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు నోటిఫికేషన్ ద్వారా తెలియ జేస్తారు. ఇకపోతే, ఇప్పటి వరకు ఈ యాప్ లో స్టోరీ 15 సెకండ్లు దాటితే ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోయేది. ఇపుడు అలా జరగదు. కొత్త అప్డేట్ ప్రకారం 60 సెకండ్ల వరకూ ఒకే స్టోరీ అయ్యే వెసులుబాటు కలదు. అలాగే ముఖ్యంగా దానిలో లోకేషన్ కూడా యాడ్ చేసుకునేందుకు మరింత సౌలభ్యం కల్పించింది.