TikTok: TikTok యాప్ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. అది రకరకాల ఎంటర్టైన్మెంట్ వీడియోలకు అది హబ్ లాంటిదని. ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధిస్తూ సోషల్ మీడియా రంగంలో తిరుగులేని రారాజుగా TikTok వెలుగొందుతోంది. కొంత కాలం క్రితం దీన్ని ఇక్కడ బ్యాన్ చేసారు. అయినా, ఎంత కొట్టినా చావని పాములాగా ప్రస్తుతం TikTok తన సత్తాని చాటుకుంటోంది. యూజర్స్ ని సంతృప్తి పరచడమే ధ్యేయంగా TikTok వివిధ రకాల మార్పులు చేర్పులతో మార్కెట్లో దూసుకెళ్తోంది.
New year celebration: మనదేశంలో న్యూ ఇయర్ వేడుకలను ఈ దేశాలలో మాత్రమే హాట్టహాసంగా నిర్వహిస్తారు!
TikTok మరో మాస్టర్ ప్లాన్ ఇదే..
TikTok తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అవును… ఫుడ్ డెలివరీ సేవలను అమెరికాలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. టిక్‌టాక్ లో వైరలైన ఫుడ్ వీడియోస్ లోని ఆహారాన్ని యూజర్లకు డెలివరీ చేసే ప్లాన్ ను రచిస్తోన్నట్లు 9To5Mac నివేదించింది. ఫుడ్ డెలివరీ సేవతో వైరల్ ఫుడ్ వీడియోలను వైరల్ చేసి, మరో నూతన అధ్యాయాన్ని సృష్టించే దిశగా కంపెనీ ప్లాన్ అడుగులు వేస్తోంది. ఈ ఫుడ్‌ను టిక్‌టాక్ కిచెన్ పేరిట ముందుగా అమెరికాలోని ప్రారంభించనున్నారు.
NTR: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో సినిమా సెట్స్ మీదకి వచ్చేది ఎప్పుడంటే..!
ఎప్పుడు స్టార్ట్ చేయబోతోంది?
TikTok కిచెన్ సేవలను రానున్న నూతన సంవత్సరం అనగా, 2022లో ప్రారంభించనుంది. అమెరికాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఈ సేవలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది చివరి నాటికి సుమారు 1,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో సేవలందించేందుకు TikTok కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టిక్‌టాక్‌లో వైరలైన ఫుడ్ వీడియోస్ మెనును కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. సో.. భోజన ప్రియులారా.. సిద్ధంగా వుండండి.