NewsOrbit
న్యూస్

New GST Rules: జనవరి 1 నుంచి ఈ వస్తువులపై ధరలు పెరిగితే.. వాటిపై పెరుగుతాయి..! 

GST Hikes: ఈరోజుతో 2021 సంవత్సరం పూర్తవుతుంది. రేపటి నుంచి 2022 ఏడాది ప్రారంభం అవుతుంది. ఐతే నూతన సంవత్సరంలోకి స్వాగతం పలకగానే జనవరి 1 నుంచే అనేక వినియోగ వస్తువులపై కొత్త జీఎస్‌టీ పన్ను రేట్లు అమలు కానున్నాయి. ఈ మార్పులు కొన్ని ముఖ్య వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. సామాన్య ప్రజలపై మాత్రం ఈ కొత్త పన్ను రేట్లు ప్రభావం చూపవు. కానీ కన్య్సూమర్‌ గూడ్స్‌పై విధించే కొత్త జీఎస్‌టీ రేట్ల వల్ల సామాన్యులు కూడా కాస్త ప్రభావితం అవుతారు. అయితే జీఎస్టీ పన్ను రేట్ల మార్పుల కారణంగా జనవరి 1 నుంచి ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

 

2022 జనవరి 1 నుంచి ధరలు పెరిగే వస్తువులివే..!

 

బట్టలు, పాదరక్షలు

జనవరి 1వ తేదీ నుంచి దుస్తులు, పాదరక్షలు వంటి వస్తువులపై 12 శాతం జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. గతంలో వీటిపై 5 శాతం మాత్రమే జీఎస్టీ రేట్లు ఉండేవి. కానీ ఇటీవల కేంద్రం 5 శాతాన్ని 12 శాతానికి పెంచేసింది. తొడుక్కునే దుస్తులు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, టేబుల్‌క్లాత్‌లు ఇలా వస్త్రాలతో తయారుచేసిన అన్ని వస్తువులపై 12% జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. పాదరక్షలపై కూడా 12 శాతం జీఎస్టీ చెల్లించాలి.

 

క్యాబ్, ఆటో రైడ్స్‌

ఓలా, ఉబర్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లపై జనవరి 1 నుంచి 5% జీఎస్‌టీ పన్ను పడుతుంది.

 

స్విగ్గీ, జోమాటో

 

జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల ద్వారా చేసే ఆర్డర్లపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

 

2022 జనవరి 1 నుంచి తగ్గే ధరల వస్తువులివే..!

 

క్యాన్సర్‌ మందులు

క్యాన్సర్‌ మందులపై 18 శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్‌టీను రేట్‌ను తగ్గించింది కేంద్రం. జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్‌టీ రేట్స్‌ అందుబాటులోకి వస్తాయి.

 

 

ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్థకమైన బియ్యం)

 

ఫోర్టిఫైడ్‌ రైస్‌పై 18 శాతం నుంచి 5 శాతనికి జీఎస్టీ రేటును తగ్గించింది కేంద్రం.

 

బయోడీజిల్‌

 

బయోడీజిల్ ఇంధనంపై కేంద్రం విధించిన 18 శాతం జీఎస్‌టీను 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju