చంద్రబాబు కి కొత్త తలనొప్పులు…??

2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయింది అన్న సంగతి తెలిసిందే. తన పొలిటికల్ కెరియర్ లో ఎన్నడూ చూడలేనీ ఫలితాలు ఏపీ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చారు. అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ఇరవై మూడు స్థానాలకు పడిపోవడంతో, టీడీపీలో చాలా మంది మహా మహా మహులు ఓడిపోవడంతో…రిజల్స్ అనంతరం చాలా వరకు పార్టీలో కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది.

Gannavaram by-poll: Another headache for Naidu! - Great Andhra English | DailyHuntమరోపక్క చంద్రబాబు వయసు మీద పడటంతో పార్టీలో ఉన్న నేతలకు తమ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భావన ఏర్పడుతున్నట్లు వార్తలు మీద వార్తలు రావటం స్టార్ట్ అయ్యాయి. ఇదే తరుణంలో అధికారంలో ఉన్న వైసీపీ భారీ మెజార్టీతో ఉండటంతో రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో పార్టీకి సంబంధించిన టిడిపి నాయకులు క్యాడర్ ని పట్టించుకోని పరిస్థితి ఏర్పడటంతో ఇటీవల చంద్రబాబు కొత్త కమిటీ లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

అయితే ఈ తరుణంలో చాలావరకు కొత్తవారిని యువకులను పార్టీ నియోజకవర్గ అధ్యక్ష పదవులను అప్పగించడం జరిగింది. ఇదిలా ఉంటే చాలా చోట్ల ఆల్రెడీ నియోజకవర్గంలో పాతుకుపోయిన టిడిపి నేతలకి కొత్తగా నియోజకవర్గానికి సంబంధించి పార్టీ పదవి పొందుకున్న యువ నాయకులకు మధ్య గొడవలు అప్పుడే స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంటరీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన చంద్రబాబుకి తాజా పరిణామాలతో యువ నేతలను కట్టడి చేయడంలో… అలాగే సీనియర్ నాయకులను కంట్రోల్ చేయడం విషయంలో తలనొప్పి స్టార్ట్ అయినట్లు టాక్. చాలా చోట్ల సీనియర్లు యువకులకు పదవులను అప్పజెప్పడం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టిడిపి పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.