NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

హ్యుందాయి నుండి కొత్త కారు..! షికారుకి సిద్ధమా..!?

 

కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..! వాహన ప్రియులను ఆశ్చర్యపరిచేలా.., ఏకంగా 50ఫీచర్లుతో..! కొత్త హ్యుందాయ్ ఐ 20 హ్యాచ్‌బ్యాక్ అలరించనుంది..! మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బ్లూలింక్ కార్ అసిస్ట్‌ను అమర్చడం వల్ల ఇది పోటీదారులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది..మరి ఇందులో ఫీచర్లు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..

 


ఇందులో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, వెహికల్ స్టేటస్ చెక్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, రోడ్ సైడ్ అసిస్ట్స్ వంటి 50 ఫీచర్లు ఇందులో ఉంటాయి. కొత్త హ్యుందాయ్ ఐ 20 మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, వీటిలో మాగ్నా, స్పోర్ట్జ్, అష్టా, అష్టా (ఓ) ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 – 11.17 లక్షలు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో టాటా ఆల్ట్రోస్, మారుతి బాలెనో, హోండా జాజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫీచర్లు :
ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 81.8 బిహెచ్‌పి శక్తితో 1.2-లీటర్ పెట్రోల్, 100 బిహెచ్‌పి శక్తితో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 100 బిహెచ్‌పి శక్తితో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. అంతేకాకుండా, మల్టిపుల్ ట్రాన్స్మిషన్ ఎంపికను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. దీనిలో 7-స్పీడ్ డిసిటి కూడా ఉంది. i20లో సరికొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో 6-ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్పెషలైజేషను ఇలా..

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్:
ఐ 20 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఇందులోని టాకోమీటర్ యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుంది. దీని మధ్యభాగంలో ఒక MID స్క్రీన్ ఉంది, ఇది వాహనదారునికి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ : సెంటర్ స్టేజ్ 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, నావిగేషన్, రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లాంప్స్ :
కొత్త ఐ 20 యొక్క ఫ్రంట్ ఫాసియా బ్లాక్ క్యాస్కేడింగ్ గ్రిల్‌లో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో చిన్న వృత్తాకార ఫాగ్ లైట్స్ కూడా LED ట్రీట్మెంట్ పొందుతాయి. దీని వెనుక చివరలో Z ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ ఎలిమెంట్‌ సొగసైన టైల్లైట్ యూనిట్ ఉంది.

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్:
ఐ 20 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఇందులోని టాకోమీటర్ యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుంది. దీని మధ్యభాగంలో ఒక MID స్క్రీన్ ఉంది, ఇది వాహనదారునికి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.

బోస్ సౌండ్ సిస్టమ్ : ఐ 20 యొక్క టాప్-స్పెక్‌లో 7 స్పీకర్ బోస్ సిస్టమ్‌కి సబ్‌ వూఫర్, బూట్‌లోని యాంప్లిఫైయర్‌తో కలిసి ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju