Vanama Raghava: పాల్వంచ ఘటనలో కొత్త కోణం..! అక్రమ సంబంధమూ కారణమే..!!

Share

Vanama Raghava: ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధికపరమైన బంధాలే’ అని ఓ తత్వవేత్త చెప్పినట్టు పాల్వంచలో జరగిన కుటుంబం ఆత్మహత్య సంఘటన నేపథ్యం ఇదే నిరూపిస్తోంది. సమాజాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా సంచలనం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోకి ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య విషయమే. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం ఎందరినో కలచివేసింది. అయితే.. ఈ దారుణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు కారకుడని.. రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపింది. సమాజంలోనూ, రాజకీయంగా కూడా ఈ విషయం సంచలనం రేపింది.

new issue raised on vanama raghava
new issue raised on vanama raghava

కుటంబమే కుట్ర చేసిందా..
ఆస్తి గొడవల్లో మధ్యవర్తిత్వం చేస్తూ రామకృష్ణను మానసికంగా ఇబ్బందిపెట్టాడని సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే.. అసలు గొడవంతా రామకృష్ణ కుటుంబంలోనే ఉందని.. ఓ అక్రమ సంబంధమే ఈ దారుణానికి మరో కారణమనే వార్తలు వస్తున్నాయి. తండ్రి వారసత్వంగా రామకృష్ణకు దక్కాల్సిన ఆస్తిని అతని తల్లి సూర్యావతి, సోదరి మాధవి దక్కకుండా చేసారని.. రామకృష్ణను అప్పులపాలు చేశారని సమాచారం. మూడు దశాబ్దాలకు పైగా పరిచయం ఉన్న రాఘవను సెటిల్ మెంట్ కి పిలిచారని ఇప్పటివరకూ వచ్చిన వార్తలు. అయితే.. తాజాగా ఈ అక్రమ సంబంధం వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఒక పెద్ద సంచలన అంశంగా మారే పరిణామాలున్నాయి. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

ఆస్తి కోసమే ఇంత దారుణమా..
(Vanama Raghava) ఈక్రమంలో ఆస్తి సెటిల్ మెంట్ విషయంలో రామకృష్ణను మానసికంగా ఇబ్బంది పెట్టాడని.. వీటన్నింటినీ తట్టకోలేకే రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర సంచలనం రేపిన ఈ విషయంలో ఇప్పుడు ఆస్తి కోసం సొంత కుటుంబమే ఇంత దారుణానికి పాల్పడటంపై పాల్వంచ వాసులు విస్మయం వ్యక్తం చేసుకుంటున్నారు. రాజకీయ కోణం ఉన్న నేపథ్యం, కుటుంబంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని బెదిరింపులు, ఆస్తి కోసం బంధాల్నే పణంగా పెట్టే గుణం.. ఇవన్నీ సమాజానికి ఓ పాఠం వంటిదే అని చెప్పాలి.

 

 


Share

Related posts

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే సంగతులు!

Teja

లోకేష్ భారీ అవినీతి… బాబు ఏమంటున్నారో తెలుసా?

sridhar

Laptop Funeral: ల్యాప్ ట్యాప్ చనిపోయింది.. అంత్యక్రియలు చేయాలన్నాడు..! ఆ తర్వాత..

Muraliak