త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్న భారీ సినిమాలు.. సక్సెస్ అయ్యేదేది?

Share

కరోనా దెబ్బకు రెండేళ్ల పాటు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఆ సమయంలో రావాల్సిన సినిమాలు అన్నీ వాయిదా పడాయి. అవన్నీ ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద హడావిడి మొదలయింది. అయితే సినిమాల మధ్య పోటీ లేకుండా సినిమాకు, సినిమాకు మధ్య ఒక వారం, రెండు వారాలు గ్యాప్ ఉండేలా మేకర్స్ ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా ఒకట్రెండు సినిమాలు మాత్రం పోటీ పడక తప్పట్లేదు. ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ కాలంలో ఆర్‌ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు విడుదలై బ్లాక్‌ బస్టర్ హిట్ కాగా మరికొన్ని మాత్రం బొక్కబోర్లా పడాయి. ఆ తరువాత సీజన్‌లో మీడియం రేంజ్ సినిమాలు తెరమీదకి వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇంకో కొద్ది వారాల్లో ఇండియాలో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటి? వాటిలో ఏవి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం.

థాంక్యూ, బింబిసార

 

జులై నెలలో నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ మూవీ రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ లాంటి మిడిల్ రేంజ్ సినిమాలు ప్రేక్షకులను అల్లరించబోతున్నాయి. ఈ రెండింటిలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఆగస్ట్ మొదటి వారంలోనే 3 మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్‌ అవుతాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్ అవుతుంది. ఇది
కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందిందిన సినిమా. కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సీతా రామం, కార్తికేయ-2

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మాణంలో హను రాఘవాపుడు దర్శకతంలో ‘సీతా రామం’ ఆగస్టు 5న రానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ – గార్జియస్ మృణాళ్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో నటించారు. జులై 22న చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న సినిమా ‘కార్తికేయ-2’. అదే రోజు ‘థాంక్యూ’ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ కారణం వల్ల ‘కార్తికేయ -2’ సినిమా విడుదల తేదీని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిని ఆగస్ట్‌ 5న రిలీజ్ చేస్తారని ప్రస్తుత టాక్. ఇలా ఆగస్ట్ మొదటి వారం లోనే వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలో చేసినవారికి సినిమా హిట్ అవడం అనేది చాలా అవసరం కానీ 3 సినిమాలు ఒకేరోజు రిలీస్ అయితే మూడు హిట్ కావడమనేది కష్టమని అంటున్నారు. కానీ ఈ డేట్ మిస్ అయితే మళ్లీ మంచి డేట్స్ దొరకడం కష్టమని ఎవరూ వెనక్కి తగ్గట్లేదు.

మాచర్ల నియోజకవర్గం, లాల్ సింగ్ చద్దా

ఇకపోతే ఆగస్ట్ రెండో వారంలో అంటే ఆగస్ట్ 12న నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’, ఆగస్ట్ 11న బాలీవుడ్ హీరో ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కాబోతున్నాయి. నాగచైతన్య ఇందులో కీలక పాత్ర పోషించడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 2న విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషలలో రాబోతుంది. దీన్నిబట్టి వచ్చే నెలలో ప్రేక్షకులకు సినిమాల జాతరే అని చెప్పొచ్చు.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

47 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago