New OTT: ఇంకా వస్తున్నయ్ ఓటీటీలు..! దిల్ రాజు, నాగార్జున..!?

New OTT: Planning by Dil Raju, nagarjuna
Share

New OTT: కరోనా కారణంగా థియేటర్లకు తాళాలు పడ్డాయి.. కానీ ఆడియన్స్ కళ్ళకు మాత్రం తాళాలు పడలేదు. ఇళ్లల్లో కూర్చుని సినిమాలు చూడడం అనే కొత్త కల్చర్ కి అలవాటు పడ్డారు.. కరోనా లాక్ డౌన్ పుణ్యమని తెలుగులో ఓటీటీలకు విపరీత క్రేజ్ వచ్చేసింది. గత ఏడాది ఏప్రిల్ నాటికి ఉన్న ఓటీటీ యూజర్ల కంటే ప్రస్తుతం 250 శాతం అధికంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఇంకా కొత్త ఓటీటీలకు ప్రయత్నాలు, ప్రణాళికలు జరుగుతున్నాయి. తెలుగులో ప్రస్తుతం టాప్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు సొంత ఓటీటీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అల్లుడు కుమర్తే ఇప్పటికే ఆహా ఓటీటీలో భాగస్వాములుగా ఉన్నారు. దానికి పోటీగా దిల్ రాజు ఓ కొత్త తరహాలో ఓటీటీ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మరోవైపు నాగార్జున కూడా ఓ ఓటీటీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన అన్నపూర్ణా నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పటికే నిర్మాతగా ఉన్న నాగార్జున ఓటీటీలపైనా దృష్టి పెట్టారట.

New OTT: Planning by Dil Raju, nagarjuna
New OTT: Planning by Dil Raju, nagarjuna

New OTT:  తెలుగులో టాప్ ఓటీటీలు ఇవే..!

ప్రస్తుతం తెలుగులో చాలా ఓటీటీలు ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా ఆహా వినిపిస్తుంది. కానీ మొదటి నుండి నెట్ ఫ్లిక్ అప్పటి నుండి ఉన్నప్పటికీ తెలుగులో ప్రాచుర్యం పొందలేదు. తెలుగులో మొదట ప్రాచుర్యం పొంది, ఎక్కువ సినిమాలు విడుదల చేసింది మాత్రం అమెజాన్ ప్రైమ్ మాత్రమే. ఇక ప్రస్తుతం చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ కి పోటీగా ఆహా కూడా బాగా విస్తరించింది. చిన్న, పెద్ద సినిమాలను నేరుగా విడుదల చేస్తుంది. మలయాళీ హిట్ సినిమాలను సొంతంగా డబ్బింగ్ చేసి విడుదల చేయడం ఆహా ప్రత్యేకత. వాటి ద్వారానే బాగా చేరువయ్యింది. ఈ రెండింటితో పాటూ జీ 5, హాట్ స్టార్, సన్ nxt, స్పార్క్ (రామ్ గోల వర్మది) తదితర ఓటీటీలు ఉన్నాయి..!


Share

Related posts

Srimukhi : వామ్మో.. బాలయ్య విషయంలో అంతపని చేసిన యాంకర్ శ్రీముఖి.. తీవ్ర ఆందోళనలో ఉన్న యాంకర్..!

Teja

Allu Arjun: జులై ఫస్ట్ వీక్ లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన.??

sekhar

దేశం ‘తీర్ధం’ పుచ్చకోనున్న ‘కోట్ల ’

Siva Prasad