Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టీఆర్పీ రేటింగ్ పెరగటానికి సరికొత్త ప్లాన్..రంగంలోకి.. సొహైల్, అరియనా…??

Share

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ అన్ని సీజన్లలో కంటే చాలా డల్ గా ఉంది అనే టాక్ బయట బలంగా నడుస్తోంది. గత నాలుగు సీజన్లలో కంటే ఈ సీజన్ మరీ దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిందని.. అందువల్లే నాగార్జున(Nagarjuna) ప్రతి వీకెండ్ గత సీజన్లో టిఆర్పి రేటింగులు గురించి ప్రస్తావించే పరిస్థితి ఉంటే ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయిందని వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు చూడని టైమింగ్స్.. 10 గంటలకు పెట్టడంతోపాటు హౌస్ లోకి కొత్త ముఖాలు ఎవరికీ తెలియని వారిని కూడా ఇవ్వటం.. వలన ఈ సీజన్ కి పెద్దగా బయట ఆదరణ దక్కలేదన్న టాక్ నడుస్తోంది. ఇదే తరుణంలో మొన్న ఐపీఎల్(IPL) మ్యాచ్ లు స్టార్ట్ అవడంతో కూడా షోకి బాగా ఎఫెక్ట్ పడిందని.. అంటున్నారు.

bigg boss sohel: బిగ్ బాస్ సొహైల్‌కి మూడు బ్రేకప్ లవ్ స్టోరీలు.. డబ్బుకోసమే  లవ్ - bigg boss fame syed sohel ryan reveals his breakup love story |  Samayam Telugu

ఇదిలా ఉంటే ఇప్పుడు t20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుండటంతో … షోకి వస్తున్న ఆదరణ కూడా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు..షో నిర్వాహకులు గమనించరట. అంతేకాకుండా ఇటీవల టిఆర్.పి రేటింగ్ లు  గతం కంటే భారీగా తగ్గటం జరిగిందట. కేవలం వీకెండ్ ఎపిసోడ్లో మాత్రమే.. నాగార్జున వస్తూ ఉండటంతో కొద్దో గొప్పో జనాలు షో చూస్తున్నట్లు… సమాచారం. కాగా సీజన్ ఫైవ్ ఇప్పటికే 50 రోజులు ముగించుకోవడం జరిగింది. దీంతో సగం సీజన్ ముగియడంతో…మిగతా బ్యాలెన్స్ షోకి .. అయినా కిక్కు వచ్చేలా.. షో నిర్వాహకులు సరికొత్త ప్లాన్ వేసినట్లు లేటెస్ట్ టాక్.

Bigg Boss 3:Baba Bhaskar Emerges As Threat

దీపావళి కి స్పెషల్ ఎపిసోడ్ షో

విషయంలోకి వెళితే దీపావళి(Diwali) ఎపిసోడ్ లో… గత సీజన్లో కి సంబంధించిన కంటెస్టెంట్ లను హౌస్ లోకి దింపుతున్నారు అట. అరియనా, సోహైల్, మోనాల్ సీజన్ త్రీ కంటెస్టెంట్ బాబా మాస్టర్ కూడా తీసుకురాబోతున్నారట. వీల్ అందరితో హౌస్ లో… ఇంటి సభ్యుల చేత ఎంటర్టైన్ చేయించడానికి.. దీపావళి కి స్పెషల్ ఎపిసోడ్ షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయాలని.. కచ్చితంగా దీపావళికి రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు నమోదు కావాలని… షో నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు అట. ఈ దెబ్బతో షోకి గతవైభవం వచ్చేలా… పగడ్బందీగా కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లు సమాచారం.


Share

Related posts

ప్రభాస్ కి పోటీ కాబోతున్న మహేష్ బాబు .. అక్కడ ఇక యుద్దమేనా ..?

GRK

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్

somaraju sharma

ఏంటి ఒక్క రోజు కి సుశాంత్ తో రియా అంతా ఖర్చు పెట్టించేదా ?

arun kanna