NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Dr.Shyam Prasad : జగన్ భజనలో అందర్నీ మించిన యూనివర్సిటీ వీసీ..! ఏపీలో కొత్త రాజకీయ వివాదం..!!

Dr.Shyam Prasad :”ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రెండోసారి జగనే సీఎం అవుతారు. అవినీతి లేనిది ఎక్కడ? కొన్ని చెడ్డ పనులను చూసీ చూడనట్టు వదిలేయాలి. అన్నివర్గాల ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు..” అంటూ జగన్ ప్రభుత్వ పాలనపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు దుమారం కూడా రేపాయి.

New political controversy in AP .. !!
New political controversy in AP .. !!

శుక్రవారం డాక్టర్ సుశ్రుత విగ్రషావిష్కరణకు వైస్ ఛాన్సలర్ కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు

Dr.Shyam Prasad : అప్పుడు బడ్జెట్లో 2 శాతం..ఇప్పుడు10 శాతం!

గత ప్రభుత్వానికి…ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడాలున్నాయని వీసీ అన్నారు. రూ.20 వేల కోట్లు జగన్ హయాంలో మంజూరు చేశారని తెలిపారు. బడ్జెట్‌లో వైద్యశాఖకు గతంలో 2శాతం మాత్రమే కేటాయించేవారన్నారు శ్యాం ప్రసాద్. జగన్ ప్రభుత్వం వచ్చాక 10శాతం వరకు కేటాయించారన్నారు. సీఎం జగన్‌ వేల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని వీసీ శ్యామ్ ప్రసాద్ ప్రశంసించారు. బీసీ, ఎస్సీ, దర్జీ దగ్గర నుంచి అన్ని వర్గాలకు డబ్బులు ఇస్తున్నారని పొగిడారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని, రెండోసారి కూడా జగనే సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు మేజర్ రెవెల్యూషన్ ఉంటుందన్నారు.

అవినీతికి సమర్థన!

అవినీతి లేనిది ఎక్కడ…. ప్రతి చోట అవినీతి ఉందని వీసీ అన్నారు. ఈ గవర్నమెంట్‌లో చాలా మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని చెత్త పనులు కూడా ఉంటాయన్నారు. వాటిని చూసీ చూడనట్లు వదిలేయాలన్నారు. దీన్ని రాజకీయంగా చూడటం తప్పు అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వీసీ శ్యాం ప్రసాద్ చెప్పారు.గతంలో తాను సీనియర్‌గా ఉండగా ఇద్దరు.. దొంగ దారిలో డైరెక్టర్లు అయ్యారని.. కోర్టు కూడా రక్షించలేకపోయిందని ఆయన ఉదాహరణగా చెప్పారు.తద్వారా టీడీపీని టార్గెట్ చేశారు.

టిడిపి మండిపాటు!

కాగా వీసీ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అధికార పార్టీకి తొత్తుగా మారి, విద్యా వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే వీసీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరి, జగన్‌కు భజన చేసుకోవాలని టీడీపీ నేతలు సూచించారు.

 

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju