NewsOrbit
న్యూస్

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..

జైఅమరావతి పార్టీకి అంకురార్పణ

సిద్ధాంతకర్తగా డాక్టర్ సీఎల్ వెంకట్రావ్… న్యూస్ ఆర్బిట్ ఎక్స్‎క్లూజివ్

ఏపీలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయ్. రాజధాని వికేంద్రీకరణతో జగన్ సర్కారు దూసుకుపోతుంటే… ఎట్టి పరిస్థితిలో అమరావతిని రాజధానిగా ప్రకటించాల్సిందేనంటూ రైతుల ఉద్యమాలు కొనసాగుతుంటే… వాటికి మద్దతుగా కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైపోతోంది.

 

జై అమరావతి పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ జరగబోతోంది. నాడు ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసి అంగీకారం తెలిపారని… ఇప్పుడు అదే పంథా కొనసాగించాలని…లేకుంటే బీజేపీకి గుడ్‎బై చెప్పి… అమరావతి ఉద్యమంలో కీలక భూమికి పోషిస్తామంటున్నారు కొందరు సీనియర్ నేతలు.
బీజేపీకి రాజకీయాలకంటే… రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి రాజధాని అంశమే ప్రధానమన్న వర్షన్ విన్పిస్తున్నారు జై అమరావతి పార్టీ నాయకులు. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ అయినా అమరావతిని కాదంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందంటూ హెచ్చరిస్తున్నారు జై అమరావతి పార్టీ సిద్ధాంత కర్త సీఎల్ వెంకట్రావ్. నాడు టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్తగా పనిచేసిన జైశంకర్ తరహాలో తాను ఇప్పుడు అమరావతి కోసం పోరాటానికి నేతృత్వం వహిస్తానంటున్నారాయన. త్వరలోనే ఈ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు చేరతారని… టీడీపీ, వైసీపీ నేతలు, మేధావులు సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతారని ఆయన వివరించారు.

నాడు టీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసిన జై శంకర్ వ్యూహాలే ఇప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగేందుకు రాగద్వేషాలకు అతీతంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నాడు టీఆర్ఎస్ లాగా సింగిల్ ఎజెండాగా పనిచేసినట్టే… జై అమరావతి పార్టీ సైతం అమరావతి రాజధాని కోసమే పనిచేస్తుందంటున్నారు. గతంలో చెన్నారెడ్డి 1969లో పార్టీ స్థాపించి 1971లో 10 స్థానాలను ఎలా గెలిచారో… తాము కూడా అమరావతి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారతామన్న ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని… ఇప్పుడు కేంద్రం సైతం రాజధాని తరలింపు ప్రకటనను ఆపాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ కేంద్ర పెద్దలు రాజధాని మార్చబోనంటూ ప్రకటన చేస్తే తామందరం బీజేపీలోనే కొనసాగుతామంటూ మరో లాజిక్ చెప్తున్నారు. గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం చెప్పిన క్షణమే తాము జైఅమరావతి పార్టీ స్థాపిస్తామన్న సంకేతాలను విన్పిస్తున్నారు.

జైఅమరావతి నేతలు మరో కాంట్రవర్శీ అస్త్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రామజన్మభూమిలో రామ మందిరం కాకుండా జమ్మూ, కశ్మీర్ రాజధాని శ్రీననగర్‎లో నిర్మించాలంటూ తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చి బీజేపీని ఇరుకునపెట్టే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఏపీకి అమరావతి వద్దనుకున్నప్పుడు అయోధ్యలో రామజన్మభూమిలోనే రాముడి ఆలయం ఎందుకు నిర్మించాలన్న వర్షన్ హైలెట్ చేసే ఉద్దేశంలో అమరావతి పార్టీ నేతలున్నారు. బీజేపీ అమరావతికి ఓకే చెప్తే ఓకే… లేకుంటే బీజేపీని విడిచిపెట్టేది లేదంటూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఆ నేతలు.

author avatar
Special Bureau

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!