Prabhas: ఇన్నాళ్ళకి ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చచేసే సమయం వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి డార్లింగ్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యాడు. సాహో లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి హిందీలో ప్రభాస్ నటించిన సినిమాతో సునామీ సృష్ఠించబోతున్నాడు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన సాహో సినిమా సౌత్‌లోని అన్నీ భాషలలో ఆకట్టుకోలేకపోయినా కూడా ఒక్క బాలీవుడ్లో మాత్రం 150 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. దీనిని బట్టే బాలీవుడ్లో ప్రభాస్‌కున్న క్రేజ్..మార్కెట్ ఏంటో అర్థమైంది.
అందుకే వరుసబెట్టి పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలను కమిటయిన డార్లింగ్ హిందీలో స్ట్రైట్ సినిమాను చేస్తున్నాడు. ఆదిపురుష్‌తో బాలీవుడ్లో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడటం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా తాజాగా నటించిన రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్‌ను బాలీవుడ్లో మొదలుపెట్టారు. ఈరోజు అక్కడ సెకండ్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇదే సాంగ్ ప్రోమో మన సౌత్‌లో రాత్రి 7 గంటలకు రిలీజైంది. హిందీలో రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోతో బాలీవుడ్లో అంచనాలు ఆకాశానికి ఎగపాకాయి.
Prabhas: రాధే శ్యామ్ మీద ఊహించని విధంగా అంచనాలు పెంచడమే మేకర్స్ పని..
హిందీ వెర్షన్‌కు సంగీతం అందించిన మనన్ భరద్వాజ్ సెకండ్ డీసెంట్ ట్యూన్ ఇచ్చాడు. ఈ సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇక తెలుగుతో పాటు మిగతా భాషలలో జస్టిన్ ప్రభాకర్ ఇచ్చిన ట్యూన్ మరో లెవల్ అనేలా ఉంది. ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ సినిమా మీద పెట్టుకున్న అంచనాలను మేకర్స్ రీచ్ అయ్యారు. ఇకపై ఈ సినిమా మీద ఊహించని విధంగా అంచనాలు పెంచడమే మేకర్స్ పని అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఇందులో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.