NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – కేసీ‌ఆర్ మధ్య కొత్త గ్యాప్ : కారణం హరీష్ ? ఇదంతా పక్కా ప్లానింగ్ ?

తెలంగాణ సీఎం కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న సఖ్య‌త గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి నుంచి మొద‌లైన ఈ మైత్రి….అనంత‌రం కూడా కొన‌సాగింది.

అనంత‌రం ఇరు రాష్ట్రాల మ‌ద్య స‌మ‌స్య‌లు ప‌రిష్కరించుకునే విష‌యంలోనూ ముందుకు సాగింది. అయితే, ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం తాజాగా తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్య‌లు.

కేంద్రంపై గుర్రుగా….

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై దీనిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కొత్త మీటర్ల కోసం రూ.700 కోట్లు అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. మీటర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారన్నారు. కేంద్రం తెచ్చే కొత్త చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని చెప్పుకొచ్చారు.

హ‌రీశ్ రావు ఏమ‌న్నారంటే…

అయితే, ఈ చట్టంపై హ‌రీశ్ రావు మ‌రింత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దుబ్బాక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న హాట్ కామెంట్లు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను హ‌రీశ్ రావు టార్గెట్ చేశారు. వ్యవ‌సాయ విద్యుత్ విష‌యంలో సీఎం జ‌గ‌న్ కేంద్రం చెప్పిన‌ట్టు ఆడుతున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ నాలుగు వేల కోట్లకు ఆశ‌ప‌డ్డార‌ని, ఆయ‌న నిర్ణ‌యం రైతుల‌కు ఉరివేయ‌డ‌మే“ అని హ‌రీశ్‌ ‌రావు మండిప‌డ్డారు.

బీజేపీని కూడా ఆడుకున్నారు

రైతుల మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం రూ. 2,500 కోట్లు ఇస్తామని చెప్పిందని, రైతుల క్షేమమే ముఖ్యమని భావించి ఆ ఆఫర్‌ తిరస్కరించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్ రావు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయం దండగ అన్నాడని, రైతులకు వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌కు మీటర్లు పెడతానని చెప్పిన విషయం మంత్రి గుర్తు చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారెవరు మనుగడ సాధించలేరని అందుకోసమే మీటర్లు పెడతామన్న చంద్రబాబును ప్రజలే ఇంటికి సాగనంపారని చెప్పారు.. అభివృద్ధిని చూడాలి. అభివృద్ధి చేసిన నాయకుడిని చూడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌లే టార్గెట్

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడగాలంటే రైతుల బోరు బావులకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని బీజేపీ నేతృత్వంలోగల కేంద్ర ప్రభుత్వం రైతుల బోర్లకు మీటర్లు బిగించాలంటుందని, ఈ నిర్ణయంతో దుబ్బాకలో 43,089 బోరు బావుల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

హరీశ్ రావు కామెంట్లు గ్యాప్ తెస్తాయా?

తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్య‌లు ఏపీ సీఎం, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డేందుకు కార‌ణం అవుతాయ‌ని ప‌లువురు అంటున్నారు. కేవ‌లం త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న‌దేంటో చెప్పాల్సింది ఏంటో పోయి ఏపీ సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం ఎందుక‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju