NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లేడీ సూప‌ర్ స్టార్‌.. రాజ‌కీయాల్లో రాణించ‌లేక‌పోతున్నారా?

విజ‌య‌శాంతి…సినిమాల్లో లేడీ సూప‌ర్ స్టార్ అనే పేరు సాధించారు. రాజ‌కీయాల్లో అడుగుపెట్టి కూడా త‌న ముద్ర వేసుకున్నారు. అయితే, ఆమెకు టైం బ్యాడ్ కొన‌సాగుతోందని అంటున్నారు.

కాంగ్రెస్‌లో కీల‌క స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ, అక్క‌డ గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని అనుకుంటున్నారో లేక మ‌రెంటో తెలియ‌దు కానీ ఆమె స్త‌బ్దుగా ఉంటున్నార‌ని టాక్‌.

విజ‌య‌శాంతి ఎందుకు ఇలా?

విజ‌యశాంతి ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ హోదాలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియరైనా.. జూనియరైనా కొత్త ఇంఛార్జ్‌ వచ్చారంటే అంతా గాంధీభవన్ ముందు జమ అవుతారు. అలా వచ్చిన ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ 3 రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కొందరు నాయకులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ జాబితాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి చేరారు. దీనికి కార‌ణం ఏంట‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎందుకిలా జ‌రిగిందంటే…

వాస్త‌వంగా కాంగ్రెస్ పార్టీకి విజ‌య‌శాంతికి మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ఉంద‌ని అంటున్నారు. కొన్నాళ్లుగా పార్టీ కోర్ కమిటీ సమావేశానికి విజయశాంతిని పిలవడం లేదట. అయితే, ఠాగూర్‌ టూర్‌ షెడ్యూల్‌లో మాత్రం కోర్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాములమ్మ పేరు ఉంది. ఈ సమాచారం ఆమె దృష్టికి తీసుకెళ్లారో లేదో కానీ.. విజయశాంతి గైర్హాజరు అయ్యారు. ఇది గాంధీభవన్‌లో పెద్ద చర్చే జరిగిందట.

రాముల‌మ్మ బాధ ప‌డుతున్నారా?

ప్ర‌స్తుతం విజ‌య‌శాంతి వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పీసీసీ మీద అలిగారో.. లేక పార్టీ మీదో కానీ.. ఆమె కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కోర్ కమిటీ సమావేశానికి రాలేకపోయినా.. ఏదో ఒక్కరోజు వీలుచూసుకుని వస్తే బాగుండేది కదా అని గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. కాంగ్రెస్‌ రాజకీయాలు ఆమెకు నచ్చలేదో.. లేదంటే తనకంటూ ఇతర రాజకీయ ఆలోచన ఏమైనా ఉందేమో అన్న ప్రచారం మొదలైందట.

పాత పార్టీ వైపు చూపుందా?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ హోదాలో ఉన్న‌ విజయశాంతి త‌న దారి తాను చూసుకుంటున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఆమె తిరిగి గ‌తంలో ఎంపీగా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారా లేక‌పోతే పాత ప‌రిచ‌యాల‌తో బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఆమె టీఆర్ఎస్ పార్టీ వైపు ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు. ఇటీవ‌లే ఆమె టీఆర్ఎస్ స‌ర్కారుపై ఫైర‌య్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వరద భీభత్సంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. చినుకు పడితే జలమయం అయ్యే హైదరాబాద్ ను ఎలాగూ కాపాడలేకపోయారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతగానితనంతో ఇప్పుడు వరంగల్ కూడా బలైపోయిందని తెలిపారు. పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న రైతన్నలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి అనేక సార్లు అగ్నిప్రమాదానికి గురైందని అయినప్పటికీ… ప్రభుత్వం దాని నివారణ చర్యలు చేపట్టలేదని తెలిపారు. సర్కారు తీరుపై డాక్టర్లు, నర్సులు ఎంతో అసంతృప్తితో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

author avatar
sridhar

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk