కరోనా టీకాపై కొత్త విషయం..! ముక్కు రంధ్రాల్లో వేసే టీకా వస్తుందట..!!

 

COVID-19 మహమ్మారికి కారణమైన వైరస్ కు వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు గడియారం చుట్టూ పనిచేస్తున్నారు. కఠినమైన ప్రయత్నం అంటే 2020 చివరి నుండి 2021 మధ్యకాలం వరకు వేగంగా ట్రాక్ చేసిన వ్యాక్సిన్ మార్కెట్‌కు రావచ్చు.

ఎక్కడ చూసినా ఇప్పుడు కొవిడ్‌ టీకా ఎప్పుడు వస్తుందనే చర్చే జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే టీకాల అభివృద్ధి కూడా రాకెట్‌ వేగంతో జరుగుతోంది. అదే సమయంలో ఓ కొత్త రకం టీకా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ టీకా..! అదేనండీ ముక్కులో వేసుకొనే వ్యాక్సిన్‌..! ప్రస్తుతం దీనికి సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ స్టేజి ప్రయోగాలు భారత్‌లో ప్రారంభం కానునున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాక్సిన్‌ ఏమిటీ.. సాధారణ వ్యాక్సిన్‌కు భిన్నంగా దీనిపై ఎందుకు ప్రయోగాలు చేపట్టారు.. దీని లాభాలేమిటీ అనే అంశంపై ప్రజల్లో కుతూహలం పెరిగింది.

ఇంట్రా నాసల్‌ టీకాను ముక్కు రంధ్రాల్లో పిచికారీ చేస్తారు. ఇది ముక్కు రంధ్రాలు.. దానికి సంబంధించిన కండరాలపై వ్యాపిస్తుంది. ఇప్పటికే జలుబు ఔషధాలను ఈ విధంగా పిచికారీ చేయడం చూస్తున్నాం.ఈ విధానంలో సిరంజీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతోపాటు సూదులు వాడకం అసలే ఉండదు. ఆల్కహాల్‌ స్వాబ్‌ల అవసరమే రాదు.ఇంట్రా నాసల్‌ టీకా రక్తంలో వ్యాధినిరోధక శక్తి ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతోపాటు అదనపు వ్యాధినిరోధక కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో పుట్టుకొచ్చినట్లు కనుగొన్నారు. ఇలా కండరాల్లో పుట్టుకొచ్చిన వ్యాధినిరోధక కణాల్లోని టిసెల్స్ వైరస్‌ను గుర్తు పెట్టుకొంటాయి. దీంతో వైరస్‌ మనిషి శరీరంలో ప్రవేశించే మార్గాల్లోనే ఇవి అడ్డుకొంటాయి.

కొవిడ్‌ టీకాను నాసికా రంధ్రాల ద్వారా మనిషికి ఇవ్వడం అత్యంత తేలికైన విధానమని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజూందార్‌ షా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి కూడా ఈ టీకాలను ప్రజలకు వేయవచ్చని ఆమె పేర్కొన్నారు. అదే కండరాలకు చేసే టీకాల పంపిణీకి సుశిక్షితులైన నర్సులు, వైద్యులు అవసరం.