Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి కి మరో కొత్త టైటిల్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. అందరికీ తెలిసిన ముఖాలలో ఒక ముఖం యాంకర్ రవి. టెలివిజన్ రంగంలో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ పంచ్ డైలాగులతో.. కామెడీ ని క్రియేట్ చేయడంలో రవి స్టైలే వేరు. మా టీవీ లో లాస్య తో చేసిన ప్రోగ్రాం తో.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రవి.. మెల్ల మెల్లగా.. పలు ప్రఖ్యాతిగాంచిన ఛానల్స్ లో… షోలు చేస్తూ.. టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే రీతిలో రాణించే వాడు. ఎంతో పాపులర్ యాంకర్ గా పేరు రవి.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో.. కచ్చితంగా మనోడు టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటిలో.. రవి ఎంట్రీపై భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. బయట రవి కి ఉండే ఫాలోయింగ్ బట్టి.. టైటిల్.. రవి దే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు.

Bigg Boss Telugu 5: Netizens Slam Nataraj For Calling Ravi a Snail - Sakshi

కానీ తీరా మనోడు హౌస్లో అడుగుపెట్టాక… ఇతరులను నెగటివ్ చేసే తరహాలో గేమ్ ఆడటంతో…రవి గ్రాఫ్ మెల్ల మెల్లగా పడిపోయింది. రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ టైం లో.. పరోక్షంగా రవి ని ఉద్దేశించి నటరాజ్ మాస్టర్.. గుంటనక్క అంటూ కామెంట్లు చేయటంతో.. పాటు అదే రీతిలో హౌస్ లో రవి ఆటతీరు ఉండటంతో.. సరైన టైటిల్ నటరాజు మాస్టర్ రవి కి పెట్టాడు అని చాలామంది బయట జనాలు భావిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో రవి లహరి ప్రియా హగ్ గొడవలో… రవి వీడియో కెమెరా లో అడ్డంగా బుక్ కావడం జరిగింది. ఆ తరువాత నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ టైం లో అన్ని కెమెరాల ముందు గుంటనక్క ఎవరు… హౌస్ లో ఆ పేరు చెబితే అందరూ నా వైపు చూస్తున్నారని రవి తనకి తాను ఒప్పుకోవడం తెలిసిందే. ఈ రీతిగా రవి…తన పరువు తానే బిగ్బాస్ హౌస్లో కెమెరాల ముందు తీసేసుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో రవి కి మరో కొత్త టైటిల్..

ఇదిలా ఉంటే తాజాగా నాలుగో వారం చివరి కి బిగ్ బాస్ హౌస్ లో రవి కి మరో కొత్త టైటిల్.. పుట్టుకొచ్చింది. విషయంలోకి వెళితే శుక్రవారం ఎపిసోడ్ లో.. హౌస్ లో ఇంటి సభ్యుల చేత.. బిగ్ బాస్ రింగ్ తో… నడుము తిప్పే ఆట ఆడించారు. ఈ గేమ్లో పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు సరిగ్గా తిప్పలేక పోయారు. ఈ క్రమంలో రవి తిప్పిన తీరు చూసిన నటరాజ్ మాస్టర్… యాంకర్ లోబో దగ్గర .. నత్త మాదిరిగా.. మనోడు చేశాడు అంటూ సరికొత్త టైటిల్ పెట్టాడు. గతంలో గుంటనక్క అని తర్వాత నత్త తో… పోల్చడం తో నటరాజ్ మాస్టర్ జంతు శాస్త్ర పితామహుడు లాగా ఉన్నాడని.. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై బయట జనాలు కామెంట్లు చేసుకుంటున్నారు.

nataraj: Bigg Boss Telugu 5: Ravi vents his displeasure over Nataraj; here's what netizens think about their 'Puli-Nakka' conflict - Times of India

నన్ను ఎందుకు మాస్టర్ టర్గెట్ చేస్తున్నాడు

ఇదిలా ఉంటే ఇదే విషయాన్ని లోబో .. రవి దగ్గర చెప్పేయడంతో… తనని ఎందుకు మాస్టర్ టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని.. రవి తెగ ఫీల్ అయిపోతున్నాడు. పూటకో జంతువు పేరు తనకి పెట్టడంపై బయట జనాలు కూడా నటరాజ్ మాస్టర్ ఆడుతున్న ఆట తీరుపై మండిపడుతున్నారు. గతంలో విశ్వా కి .. ఊసరవెల్లి అని… మరో సందర్భంలో పిల్లి నెమలి ఎలుగుబంటు అంటూ ఇలా రకరకాల జంతువులు పేర్లు నటరాజ్ మాస్టర్ ఇంటి సభ్యులపై వాడడాన్ని బయట జనాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 


Share

Related posts

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో రానా తప్ప మరెవరు వద్దంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్… మరి ఈ షాకేంటి ..?

GRK

ఈఎంఐ వడ్డీ లపై సుప్రీమ్ షాకింగ్ నిర్ణయంతో అంతా తలకిందులు..! ప్రజల పరిస్థితి ఏంటి…?

arun kanna

Bail to Pattabhi: పట్టాభికి బెయిల్‌ మంజూరు.. కోర్టు కీలక వ్యాఖ్యలు..!!

Srinivas Manem