Vizag: విశాఖపట్నం అనగానే మనకి ముందుగా గుర్తుకువచ్చేది బీచ్ అందాలు. ఈ బిజీ బిజీ గందరగోళం లైఫ్స్ లో కొంత సమయం అయినా సముద్ర తీరంలో ప్రశాంతంగా గడపాలని చూస్తూ ఉంటారు. సముద్ర అందం వర్ణనాతీతం అని చెప్పవచ్చు. తెలుగులో సముద్రం మీద ఎన్నో కవితలు మరెన్నో పాటలు ఉన్నాయి. అలాగే సముద్ర గర్భంలో కూడా మనకు తెలియని అందాలు మరెన్నో ఉన్నాయి. ఈ మధ్య ప్రభుత్వాలు కూడా వాటి మీద శ్రద్ద పెట్టి పర్యటక స్థలాలుగా మారుస్తున్నాయి. తాజాగా రిషికొండ బీజ్ వద్ద కొందరు స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో ఒక ప్రదేశాన్ని కొనుగొన్నారట.
ఇటీవల స్కూబా డైవర్లు వైజాగ్ లో మంగమారిపేట బీచ్ లో ఒక సహజ శిలా తోరణం ఉన్నట్లు గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఈ బీచ్ ఒక పర్యాటక ప్రదేశంగా మారింది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ సహజ శిలా తోరణం ఏరపడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే రిషికొండ బీచ్ నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో సముద్రగర్భంలో 30 అడుగుల లోతున్న సహజ శిలా తోరణాన్ని కొందరు స్కూబా డైవర్లు కొనుగొన్నారు. సముద్ర గర్భంలో వీరు అన్వేషిస్తున్న సమయం లో ఈ శిలా తోరణం వెలుగులోకి వచ్చింది.
నిత్యం, నేవీ రిటైర్డ్ ఉద్యోగి బలరామనాయుడు గారి ఆధ్వర్యంలో సముద్ర గర్భంలో అన్వేషణ జరుగుతూ ఉంటుంది. ఈ బృందం గతంలో కూడా సముద్ర గర్భంలో కొన్ని కొండలు మరియు నౌకలను గుర్తించారు. కానీ ప్రస్తుతం ఈ బృందం ఇచ్చిన సమాచారం ప్రకారం ఇలాంటి శిలాజాన్ని ఇంతక మునుపు ఎప్పుడూ గుర్తించలేదట. ఈ శిలాజం రెండు కొండల మధ్య ఓ టన్నెల్ లాగా కనిపిస్తుంది అని అంటున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…