Dowry: ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలంటే ఇంటికి పాములు తెచ్చుకోవాలి ..!

Share

Dowry: దేశంలో వరకట్నం అంతమైపోయిందని అనుకుంటే పొరపాటే. చాలా చోట్ల ఇంకా కట్నం ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ కూడా కట్నంగా డబ్బులను, బంగారాన్ని, వాహనాలను, పొలాలను, స్థలాలను ఇచ్చేవారు. ఇవే కాదు చాలా చోట్ల వింత ఆచారాలు (tradition) కొనసాగుతున్నాయి.

 Breaking: పవన్ కళ్యాణ్ ఇంటికి రాజమౌళి..!
పాములు ఇవ్వడం ఆచారంగా:

ఓ గ్రామంలో పెళ్లిల్లకు(marriage) డబ్బు, బంగారంతో పాటుగా 21 అత్యంత విషపూరితమైన పాములను కట్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదొక వింత ఆచారం. మధ్యప్రదేశ్‌ లోని గౌరియా తెగవారు ఇటువంటి వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా పాటిస్తున్నారు. కూతురికి ఒకవేళ పెళ్లి చేస్తే అల్లుడికి విషపూరితమైన 21 పాములను (snakes)కట్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్నం ఇవ్వకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే నాశనం అవుతుందని బలంగా నమ్మకం ఉంది. అంతేకాకుండా ఈ తెగ వారు తమ బతుకుదెరువు కోసం పాములను పట్టడం అలవాటు. వారు పాములను పట్టి బతుకుతుంటారు.

Evaru Meelo Koteeswarudu: “ఎవరు మీలో కోటీశ్వరుడు..!? రూ. కోటి కలలను సాకారం చేసుకున్న విజేత..!
ఎక్కడి వారు ఈ ఆచారాన్ని పాటిస్తారంటే..

ఈ తెగవారు వారు పట్టిన పాములను జనాల ముందు పెట్టుకుని సర్కస్ వంటివి చేస్తారు. ఆ పాములను ఆడించటం ద్వారా డబ్బులను సంపాదిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడి తెగలో వారికి పెళ్లి చేస్తే అమ్మాయి తరపు వారు 21 పాముల్ని సమర్పించుకోవాలి. ఇలా కట్నంగా ఇచ్చిన పాముల్ని వారు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగిస్తారు. కట్నంగా వచ్చిన పాముల ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఆడపిల్ల తండ్రి తన అల్లుడికి పాములను కట్నంగా ఇవ్వడం వెనక ఇంత కథ ఉంది. కట్నంగా తీసుకున్న పాములను మగ పెళ్లివారు కఠిన నియమాలతో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ భద్రపరచిన బాక్సులో పాము చనిపోయినట్లైతే దానిని అశుభంగా భావిస్తారు. అంతేకాకుండా అలా పాము చనిపోతే ఆ కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటుంది. ప్రస్తుతం ఈ వింత ఆచారం వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రపంచంలో ఇలాంటి వింతలు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ఆలోచనలో పడుతున్నారు.


Share

Related posts

లాస్య, మోనల్ కలిశారు.. రచ్చ రచ్చ చేశారు?

Varun G

AP High Court: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసిన ఏపి హైకోర్టు

somaraju sharma

Ali Reza: అలీ రెజా అభిమానులకు గుడ్ న్యూస్..!!

sekhar