అగ్గి రాజేసిన వేడుక

హైదరాబాదు, జనవరి 1: మాదాపూర్ సిద్ధి వినాయక నగర్‌లో నూతన సంవత్సర వేడుకలు అగ్గి రాజేసాయి. వేడుకల నిర్వహణ సక్రమంగా లేదంటూ పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సరిగా సరఫరా చేయలేదని, డీజె సౌండ్ సరిగా లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టేబుళ్ళు, కుర్చీలు విరగకొట్టారు. మద్యం సీసాలు పగులగొట్టి వేదికపై విసిరి నిప్పు అంటించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏమి జరుగుతుందో అర్థం కాక వేడుకలకు వచ్చిన వారు భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు.