NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఇదో కొత్త క్రైమ్..! సినీ నటులు, పోలీసులు, లాయర్లు అందరూ బాధితులే..!!

“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్రైం బ్యూరో

రూ. 5000 అర్జెంట్ ఇవ్వండి ప్లీజ్…! అర్జెంట్ గా రూ. 10000 ఫోన్ పే చేయండి, అరగంటలో ఇచ్చేస్తా..! తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ సుమతి ఫేస్బుక్ ఐడి పేరుతో కొందరికి ఈ మధ్యకాలంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళాయి. తర్వాత వారందరికీ సుమతి అర్జెంట్ అవసరం లో ఉన్నట్లు, వెంటనే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 5000 వెంటనే అకౌంట్లో వేయాలని అభ్యర్థనలు వెళ్ళాయి. అయితే ఇది పంపింది సబ్ ఇన్స్పెక్టర్ సుమతి కాదు..!

* గుంటూరుకు చెందిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ పేరుతో ఆయన ఫ్రెండ్ లిస్టు లో ఉన్న అందరికీ డబ్బులు వెంటనే పంపించాలని అత్యవసరంగా చాలా చిన్న మొత్తం అవసరం ఉందని రిక్వెస్ట్ లు వెళ్లాయి, అభ్యర్థన చేసింది అంజిరెడ్డి కాదు.

* నెల్లూరు నగరానికి చెందిన ఓ సి ఐ ఫేస్బుక్ ఐడి నుంచి వందల సంఖ్యలో చాలా చిన్న మొత్తంలో డబ్బు అవసరం ఉందని వెంటనే తన గూగుల్ పేకి పంపించాలంటూ ఆయన ఫేస్బుక్ మిత్రులందరికీ సందేశాలు వెళ్ళాయి. ఓ లాయర్ కి కూడా వెళ్లాయి. సిఐ గారికి ఏం జరిగిందో నాని సన్నిహితులు ఆయన ఫోన్ చేస్తే డబ్బులు పంపమన్నది తాను కాదంటూ సిఐ చెప్పారు.

చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ టింగ్ మని మోగుతుంది. ఫేస్బుక్ మెసెంజర్ లో కి ఓ సందేశం వచ్చి చేరుతుంది. అప్పటివరకు మీ ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న ఓ ఉన్నతాధికారి హాయ్.. హౌ ఆర్ యు అంటూ పలకరిస్తారు. ఎస్ సర్ ఐ యాం ఫైన్ అని మీరు చెప్పే లోపలే ఒక అర్జెంటు అని పడింది అని వెంటనే ఒక 5000 డబ్బు పంపించాలంటూ అభ్యర్థన వస్తుంది. అప్పటివరకు సంఘంలో ఎంతో విలువ ఉన్న సదరు అధికారి ఒకేసారి 5000 అర్జెంటు అనగానే మీ మనసు ఎక్కడో మెత్తబడుతుంది. అవతలి వ్యక్తి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించమని అర్జెంట్ అని మరోసారి గూగుల్ పే నెంబర్ ను ఇస్తాడు. దీంతో మీరు డబ్బులు వెంటనే పంపించి, సదరు అధికారికి ఫోన్ చేసి ఏమైందని వివరం కోరుతారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సదరు అధికారి నేనేమి డబ్బులు కోరలేదని, అంత అర్జెంటుగా డబ్బులు ఏం అవసరం రాలేదని చెప్పడంతో విస్తుపోవడం మన వంతు అవుతుంది. అదేమిటని మరోసారి ఫేస్బుక్ మెసెంజర్ లో కి వెళ్ళి చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ ను డబ్బులు పంపిన వివరాలను సదరు అధికారి కి పంపిస్తే, అదో ఫేస్బుక్ నకిలీ అకౌంట్ అని ఆయన చెప్పడం తర్వాత 5000 పోగొట్టుకున్న బాధితుడు నోరెళ్ళ పెట్టడం క్షణాల్లో జరిగిపోతుంది. ( ఇది తిరుపతికి చెందిన ఓ బాధితుడు చెప్పిన కథ). ప్రస్తుతం ఫేస్బుక్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న నకిలీ అకౌంట్ల పేరున డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠా ఆగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

సంఘంలో పేరు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని..!

ఈ నకిలీ ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఉన్నత ఉద్యోగాలు, హుందాగా జీవించే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చెలరేగి పోతోంది. ముందుగా అలాంటి వారిని ఎంపిక చేసుకొని, నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. తర్వాత వారి ఫ్రెండ్ లిస్టు లోని వారితో మాట కలుపుతున్నారు. అచ్చం అదే పేరుతో ఎకౌంట్ ఉండడంతో వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అవతలివారు యాక్సెప్ట్ చేస్తున్నారు. దీంతో అవతలివారు ఫేస్బుక్ వేదికగా మెసెంజర్ రూపంలో డబ్బులు అర్జెంట్ గా కావాలి అని అడుగుతున్నారు. అప్పటి వరకు ఎంతో సుపరిచితులైన ఉన్నత ఉద్యోగంలో ఉన్న సదరు వ్యక్తులు కేవలం ఐదు వేలు ఇవ్వాలని కోరడంతో వెంటనే అవతలి వారు స్పందించి అంత తక్కువ మొత్తం ఎందుకు అవసరం అయిందో అన్న కోణంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా తిరుపతి నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు అధికారుల ఫేస్బుక్ ఖాతాలను సృష్టించిన ఈ ముఠా సదరు అధికారులు ఫ్రెండ్ లిస్టు లో ఉన్న వ్యక్తుల నుంచి రూ. లక్షల్లో కోల్ల కొట్టినట్లు తెలుస్తోంది. ఇక జర్నలిస్టులు వైద్యులు లాయర్లు ఇలా సమాజంలో ఉన్నతంగా జీవించే వ్యక్తులను టార్గెట్ చేసుకొని కొన్ని వేల నకిలీ ఐడిలను ఈ ముఠా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొందరు ఈ నకిలీ ఫేస్బుక్ ఐడి ల స్కామ్పై పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు దీన్ని ఒక చిన్న విషయంగానే తీసుకొని తమ ఫేస్బుక్ నకిలీ ఖాతాలు సృష్టించబడ్డాయి అని ఒక స్టేటస్ పెట్టి తమ స్నేహితులను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఇలాంటి సందేశాలు అందుతున్నాయి. ఇప్పటికే వీటిని నమ్మి కొన్ని లక్షల రూపాయల మేర డబ్బును ఈ ముఠా ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది.

పెద్ద రాకెట్ లాగానే ఉంది..!!

ఇది చూడడానికి, వినేందుకు చిన్నగానే అనిపించినా దీని వెనుక పెద్ద కుట్ర చూడడానికి వినేందుకు చిన్నగానే అనిపించినా దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లుగానే తెలుస్తోంది. కొందరి వద్ద 5000 మరికొందరు వద్ద వెయ్యి రూపాయలు, 2000 అడుగుతున్నా ఈ ముఠా లోని సభ్యులు కేసు పెద్దవి కాకుండా తమ మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ముఠా సభ్యులు పంపించిన అకౌంట్లకు డబ్బులు పంపిన బాధితులు తర్వాత విషయం తెలుసుకున్న, తక్కువ డబ్బే కదా అని మిన్నకుండి పోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వైద్యుడు నకిలీ ఖాతా తో వారి స్నేహితుల వద్ద సుమారు మూడు లక్షల మేర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల నకిలీ అకౌంట్లను సృష్టించిన ఈ ముఠా సభ్యులు తక్కువ మొత్తంలోని డబ్బులు ఒక్కొక్కరి వద్ద అడుగుతున్నా దాన్ని పోగేసుకుని రూ.లక్షల్లో నే దందాకు తెర లేపిన ట్లు తెలుస్తోంది.

ఈ దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, పోలీసులు, నటులు, ప్రముఖులు పేర్లు బాగా వాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నకిలీ ఫేస్బుక్ ఖాతా బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. అంటే ఈ నకిలీ ముఠా సభ్యులు రాష్ట్రంలో మొత్తం కీలకమైన సభ్యుల వివరాలను పక్కాగా సేకరించి ఈ దందా కు మొదలుపెట్టినట్లు అర్థమవుతోంది. బాధితులకు పంపుతున్న అకౌంట్ వివరాలు ఫోన్ నెంబర్ ను సైతం వేర్వేరుగా ఉండటంతో, ఈ ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సైబర్ తరహా నేరం లా కనిపిస్తున్న ఇది చాలా సింపుల్ గా, కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే చేసే నేరం గానే తెలుస్తోంది.

AP Police ; Police Targeted by Politics

ఈ జాగ్రత్తలు అవసరం సుమీ..!!

ఈ నేరం జరుగుతున్న తీరు మీడియాలో గానీ విస్తృతంగా ప్రచారం కావాలి. అలాగే డిజిటల్ మీడియాలోనూ, సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగితే చాలామందికి జరుగుతున్న మోసం గురించి తెలుస్తుంది. అలాగే పోలీసులు సైతం దీనిపై కేసులు నమోదు చేసి ఈ ముఠాలోని సభ్యులు వెంటనే పట్టుకుంటే బాగుంటుంది. అందరి వద్ద తక్కువ అమౌంట్ మాత్రమే భావిస్తే మాత్రం అది తప్పే అవుతుంది. కొన్ని వేల మంది వద్ద డబ్బులు సేకరించిన వీరు రూ.కోట్ల లోనే ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. అయితే ఫేస్ బుక్ వినియోగదారులకు సైతం ఇలాంటి ముఠా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ముందుగా ఫేస్బుక్ అందిస్తున్న ప్రొఫైల్ లాక్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఖాతాను భద్రపరుచుకోవచ్చు.

author avatar
Special Bureau

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N