30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
ట్రెండింగ్ న్యూస్

News Today October 11: మీ కోసం ఈరోజు ప్రధాన వార్తలు

Top News Today in Telugu
Share

News Today October 11: న్యూస్ ఆర్బిట్ నుండి మీ కోసం ఈరోజు ప్రధాన వార్తలు

News Today October 11: న్యూస్ ఆర్బిట్ నుండి మీ కోసం ఈరోజు ప్రధాన వార్తలు

GodFather: చిరంజీవి “గాడ్ ఫాదర్” పై రజినీకాంత్ పొగడ్తలు..!!

rajanikanth Rajanikanth comments on chiranjeevi godfather movie
Rajanikanth comments on Chiranjeevi Godfather movie

దసరా పండుగ నాడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఒరిజినల్ కథకి పూర్తి భిన్నంగా తెలుగు నేటివిట్టికి దగ్గరగా… కథలో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమాలో బ్రహ్మ పాత్రలో చిరంజీవి నటన చాలా వైవిధ్యంగా కొత్తగా.. ప్రజెంట్ చేయటంలో దర్శకుడు మోహన్ రాజా సక్సెస్ సాధించారు. Read full article

పరిశ్రమలు, మౌళిక వసతులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రతేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలను 2024 మార్చి నాటికి ప్రారంభం కావాలని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు అన్నీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. జవ్వులదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ల పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ పనులను 2023 జూన్ కల్లా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read full article

ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లి ఆల‌స్యం అవుతోంది.. త్రిష‌ కామెంట్స్ వైర‌ల్‌!

Trisha comments on her marriage
Trisha comments on her marriage

మూడు పదుల వయసు దాటుతున్న ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా సత్తా చాటుతున్న త్రిష.. గ‌తంలో ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపించింద‌నే టాక్ ఉంది. కానీ, ఎవ‌రితోనూ ఈ అమ్మ‌డు పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌లేదు. అయితే ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదో తాజాగా త్రిష్ క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. Read full article

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ సతీమణి మృతి.. గాయాలతో బయటపడిన డీజీ గోవింద్ సింగ్

తెలంగాణ సీఐడీ డీజీ గోవింగ్ సింగ్ సమీమణి షీలా సింగ్ రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గోవింద్ సింగ్ తో పాటు ఆయన కారు డ్రైవర్ కూడా గాయపడ్డారు. రాజస్థాన్ లోని ప్రఖ్యాత మాతేశ్వరి తనోదరాయ్ మాత ఆలయాన్ని సందర్శించే నిమిత్తం గోవింద్ సింగ్ సతీమణి షీలా సింగ్ తో కలిసి వెళ్లారు. మతేశ్వరిని దర్శంచుకున్న తర్వాత సతీసమేతంగా ఆయన తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు. Read full article

త‌ల్లి అయ్యాక నయనతారకు కొత్త త‌ల‌నొప్పి.. సరోగసీపై మొద‌లైన విచార‌ణ‌!

Tamilnadu govt responds on nayanthara surrogacy
Tamilnadu govt responds on nayanthara surrogacy

లేడీ సూపర్ స్టార్ నయనతారకు తల్లి అయ్యాక కొత్త తలనొప్పి మొద‌లైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివ‌న్‌ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల‌ నుంచి ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. Read full article

చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా రోజుల తర్వాత నేడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ను కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన సమీక్షా సమావేశానికి హజరు కాకపోవడంపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తొంది. రాష్ట్రంలో ఇటీవల హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా ప్రభుత్వం పేరు మార్చింది. అయితే ఈ ప్రతిపాదన సమయంలో సీఎం జగన్ కు వల్లభనేని వంశీ ఈ అంశంపై పునరాలోచన చేయాలంటూ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. Read full article

RGV: చిరంజీవిపై గరికపాటి వ్యాఖ్యలకు రాంగోపాల్ వర్మ సీరియస్ కామెంట్స్..!!

Ramgopal Varma's Serious Comments on Garikapati's Comments on Chiranjeevi
Ramgopal Varma8217s Serious Comments on Garikapati8217s Comments on Chiranjeevi

ఇటీవల “అలయ్ బలయ్” కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సరిగ్గా ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి రావటంతో సభ ప్రాంగణం మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఈ క్రమంలో వేదికపై చిరంజీవి రాగానే ఒక్కసారిగా ఆయనతో సెల్ఫీలు దిగటానికి ఎగబడ్డారు. దీంతో ప్రసంగిస్తున్న గరికపాటి అసహనానికి లోనయ్యారు. వెంటనే ఫోటో సెషన్ ఆపేయాలని మైకులో అరవటం జరిగింది. అదే సమయంలో చిరంజీవి గారు.. మీరు ఫోటోలు దిగటం ఆపేయాలి. లేకపోతే నేను మైక్ విడిచి వెళ్ళిపోతాను.. నువ్వు ఆపుతావా లేకపోతే నన్ను వెళ్లిపోమంటావా..? గరికపాటి మైక్ లో అరిచేశారు. Read full article

అక్టోబర్ 11 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

మేషం
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. Read full article

Astrology Today Cover
అక్టోబర్ 11 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు..!!

Bigg Boss 6

బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ ఆరో వారంకి చేరుకుంది. ఐదో వారంలో చంటి ఎలిమినేట్ కావటంతో…హౌస్ లో కొద్దిగా సందడి వాతావరణం తగ్గింది. చంటి ఉన్నంతకాలం ఇంటిలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కనిపించేది. అయితే ప్రస్తుతం హౌస్ లో కొద్దిగా సీరియస్ వాతావరణం నెలకొంది. ఆదివారం ఎపిసోడ్ కావటం ఇంటి సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. పరిస్థితి ఇలా ఉండగా ఆరో వారం నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ అన్నట్టుగా ఇంటి సభ్యుల మధ్య గట్టి వాదోపవాదాలు జరిగాయి. నామినేషన్ మధ్యలో రోహిత్ ఇంకా ఆదిరెడ్డి మధ్య గొడవ కొట్టుకునేంత దాకా సీన్ క్రియేట్ అయింది. Read full article

`ఆదిపురుష్‌`కు కొత్త చిక్కులు.. ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. Read full article

Liger: “లైగర్” ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు..!!

Vijay Deverakonda latest comments on Liger movie

ఈ ఏడాది ఆగస్టు 25వ తారీకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడిన సంగతి తెలిసిందే. వరస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి “లైగర్” అతి పెద్ద దెబ్బ వేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా సినిమా విడుదల అవ్వకముందు ఇండియా షేక్ చేస్తాం అంటూ పెద్ద పెద్ద డైలాగులు సినిమా యూనిట్ వేయడం జరిగింది. Read full article

 


Share

Related posts

Amit Shah: దక్షిణాది సీఎంలను ఉసూరుమనిపించిన అమిత్ షా!వారు చెప్పిందానికి ఊకొట్టి పంపించేసిన వైనం!

Yandamuri

Sri Reddy : మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!

Teja

Cabinet Decisions: పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..!!

somaraju sharma