టెలివిజన్ న్యూస్‌ఛానళ్ల న్యూసెన్స్‌పై యూట్యూబ్‌లో వ్యంగ్యం గుమ్మరించే న్యూస్‌లాండ్రీ వెబ్‌సైట్ వారు గత వారం బాలాకోట్ ఎయిర్‌స్ట్రయిక్స్‌పై ఎపిసోడ్ తీశారు. గత రెండు వారాలుగా న్యూస్ ఛానళ్ల స్టూడియోల్లో కనబడుతున్న యుద్ధోన్మాదంపై దృష్టి పెట్టామని న్యూస్‌లాండ్రీ పేర్కొన్నది.
న్యూస్‌లాండ్రీ వార్తలు, కరెంట్ ఎఫైర్స్ మాత్రమే కాకుండా మీడియా తీరుతెన్నులపై వ్యాఖ్యానం చేస్తుంది. స్వతంత్రత, పారదర్శకత ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు లాంటివని న్యూస్‌లాండ్రీ విశ్వసిస్తుంది. ఆ దారిలోనే ఆ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ కూడా నడుస్తాయి.
బాలాకోట్ ఎయిర్‌స్ట్రయిక్స్‌పై న్యూస్ ఛానళ్ల కవరేజి మీద న్యూస్‌లాండ్రీ మార్కు వ్యంగ్యం చూడండి: