NewsOrbit
న్యూస్

ఐపీఎల్‌ ఆతిథ్యానికి న్యూజిలాండ్‌ రెడీ.. బీసీసీఐ ఏమంటోంది ?

కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ టోర్నీ నిర్వహణపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ నెలల మధ్య ఐపీఎల్‌ను నిర్వహించాలని అనుకున్నా.. అదే సమయంలో టీ20 వరల్డ్‌కప్‌ ఉంది. కానీ వరల్డ్‌ కప్‌పై ఐసీసీ ఇంకా ఎటూ తేల్చలేదు. దీంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వరల్డ్‌ కప్‌ నిర్వహణపై ఐసీసీ స్పష్టత ఇస్తే గానీ బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించడంపై స్పష్టత రాదు. అందువల్ల ఇప్పుడు బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది.

newzealand came forward to host ipl bcci thinks

అయితే ఒక వేళ వరల్డ్‌ కప్‌ జరగకపోతే.. అప్పటి వరకు భారత్‌లో కరోనా ప్రభావం తగ్గితే ఓకే.. టోర్నీని ఇక్కడే నిర్వహిస్తారు. కానీ కరోనా ప్రభావం తగ్గకపోతే మాత్రం ఐపీఎల్‌ను విదేశాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయమై ఇప్పటికే శ్రీలంక, దుబాయ్‌లు ఐపీఎల్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తామంటూ ముందుకు వచ్చాయి. ఇక తాజాగా న్యూజిలాండ్‌ కూడా ఐపీఎల్‌ నిర్వహణకు రెడీ అంటోంది. కానీ బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. అయితే నిజానికి శ్రీలంక, దుబాయ్‌ల కన్నా న్యూజిలాండ్‌ ప్రస్తుతం కరోనా ఫ్రీ కంట్రీగా ఉంది. అందువల్ల అక్కడ ఐపీఎల్‌ను నిర్వహిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ న్యూజిలాండ్‌కు, భారత్‌కు మధ్య కాలమానం చాలా తేడా ఉంటుంది.

న్యూజిలాండ్‌ కాలమానం భారత్‌ కన్నా.. సుమారుగా ఏడున్నర గంటల ముందు ఉంటుంది. అంటే.. న్యూజిలాండ్‌లో రాత్రి పూట ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తే అప్పుడు భారత్‌లో ఇంకా మధ్యాహ్నం 12.30 గంటలే అవుతుంటుంది. ఆ సమయంలో ప్రేక్షకులు చాలా మంది బయటే ఉంటారు. ఆఫీసులకు వెళ్లేవారు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేవారు సాయంత్రమే ఐపీఎల్‌ను చూస్తారు. కనుక మధ్యాహ్నం సమయంలో ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌ తక్కువగా ఉంటుంది. అసలే కరోనా వల్ల ప్రేక్షకులు లేకుండా స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహించే ఉద్దేశం ఉంది. అందువల్ల కనీసం టీవీల్లో అయినా ఎక్కువ మంది మ్యాచ్‌లను చూసేలా టోర్నీని నిర్వహించాలన్నది బీసీసీఐ ప్లాన్‌. కానీ న్యూజిలాండ్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తే మ్యాచ్‌లకు వ్యూయర్‌షిప్‌ తక్కువగా ఉంటుంది. కనుక బీసీసీఐ ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.

అయితే జూలై నెలలోనే టీ20 వరల్డ్‌కప్‌పై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చెప్పింది కనుక.. ఇప్పుడు అందరూ ఐసీసీ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వరల్డ్‌ కప్‌ జరగకపోతే కచ్చితంగా ఐపీఎల్‌ జరుగుతుందని భావించవచ్చు కనుక.. ఎటు చూసినా.. మరో 2, 3 నెలల్లో మనం ఏదో ఒక మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను అయితే కచ్చితంగా వీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.

author avatar
Srikanth A

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju