Tollywood: ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పోటీ మామూలుగా లేదు..!!

Share

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కరోనా కారణంగా రిలీజ్ విషయంలో వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం మాత్రమే గాక చాలామంది వ్యాక్సింగ్ చేయించుకోవడం తో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో.. జనవరి మాసంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవటానికి సిద్ధమవుతున్నాయి.

Winner Announced: Mahesh Babu Defeats Prabhas & Pawan Kalyan, Check Out Details | IWMBuzz

ఇప్పటికే పవన్ కళ్యాణ్ “బిమ్లా నాయక్”.. మహేష్ “సర్కారు వారి పాట”.. రిలీజ్ సంక్రాంతి అని ఫిక్స్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఇదే సమయంలో అక్టోబర్ మాసంలో అనుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా “ఆచార్య”.. కూడా సంక్రాంతికి రిలీజ్ కానుందట. అదే రీతిలో ప్రభాస్ రాదేశ్యాం… అనిల్ రావిపూడి దర్శకత్వం లో వరుణ్ తేజ్.. వెంకటేష్ నటించిన “ఎఫ్ 3” సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వార్ ఓ రేంజ్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

 

సినిమా ధియేటర్ లకు కూడా పోటీ ఉంటుందని పేర్కొంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అనేది పెద్ద సీజన్. సరిగ్గా సమరం ముందు ఈ సీజన్ నీ ఆధారం చేసుకుని పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగ అతి పెద్దది కావడంతో.. సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున అతి పెద్ద భారీ బడ్జెట్  సినిమాలు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

ఆలయాలపై నకిలీ వెబ్‌సైట్‌లు ఉన్నాయి జాగ్రత్త!

somaraju sharma

Corona Virus Medicine: కేంద్రమూ, కలెక్టరూ అందరూ ఈ గ్రామాన్ని చూస్తున్నారు.. కొత్త మందుతో కరోనా పరార్..!!?

Yandamuri

Vidya Balan: ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యాబాలన్ షేర్నీ ట్రైలర్..!!

bharani jella