ఎన్జీటీ తీర్పు ఓకే: సుప్రీం

అమరావతి నిర్మాణంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ( ఎన్జీటీ) దానిని కొట్టి వేసిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ, అవన్నీ సరైనవేనని ఎన్జీటీ తీర్పు ఇచ్చింది.

అయితే ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ..సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ సందర్భంగా పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు..ఇటువంటి పిటిషన్ లకు విచారణార్హత లేదని పేర్కొంది. దురదృష్టమేమిటంటే ఇటువంటి పిటిషన్లు భారత్ లో మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించింది.