నక్సల్స్ తో చర్చలకు నో : ఛత్తీస్ గఢ్ సీఎం

85 views

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్…రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు నక్సలైట్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు. అయితే నక్సలైట్ల బాధిుతలను కలిసి వారితో కూడా మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో నక్సల్స్ సమస్యకు రాజకీయ, ఆర్థిక, సామాజిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత పదిహేనేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్ రాష్ట్రంలో నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఒక మార్గంలో ప్రయత్నాలు సాగించారనీ, ఇప్పుడు తమ ప్రభుత్వం మరో మార్గంలో ప్రయత్నాలు చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలో జమ్మూ కాశ్మీర్ తరువాత అత్యధికంగా పారా మిలిటరీ బలగాలు ఉన్న రాష్ట్రం ఛత్తీస్ గఢ్ మాత్రమేనని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు.