NewsOrbit
న్యూస్

అతనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయండి

Share

అమరావతి, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు ముగియంతో శుక్రవారం ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. నిందితుడికి సరైన భద్రత కల్పించాలని అతని తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.రాజమండ్రి  జైలులో నిందితుడికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీస్, జైలు శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది.

నిందితుడి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మధ్యాహ్ననికి వాయిదా వేసింది.

ఎన్ఐఎ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం కోర్టులో విచారణ జరగనుంది.

జైలులో శ్రీనివాసరావును తీవ్రమైన నేరాలు చేసిన వారితో కలిపి ఉంచుతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాసరావు కోర్టుకు విన్నవించాడు.

విశాఖ ఎయిర్ పోర్టు ఆవరణలో అక్టోబర్ 25న శ్రీనివాసరావు కోడికత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు.


Share

Related posts

Pomegranate Leaves: ఈ ఆకులు అందరికీ తెలిసినవే..!! దీని ప్రయోజనాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు..!!

bharani jella

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా..?

somaraju sharma

ఇంటర్ పాస్ అయ్యారా… ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టేయండి – ఆన్ లైన్ లో వెంటనే అప్లయ్ చేయండి

arun kanna

Leave a Comment