NewsOrbit
జాతీయం న్యూస్

సిద్దూ మూసా వాలా హత్యతో సంబంధాలు ఉన్న గ్యాంగ్ స్టర్ ల ప్రాంతాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు

పంజాబ్ సింగర్ సిద్దూ మాసావాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత గ్యాంగ్ స్టర్ ల ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం విస్తృత దాడులు చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలలోని స్థానిక పోలీసుల సహకారంతో పలువురు గ్యాంగ్ స్టర్ల కు చెందిన ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, నీరజ్ బవానా గ్యాంగ్ లకు చెందిన పది మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద డిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఏడాది మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో సింగర్ సిద్దూ మూసావాలాను దుండగులు కాల్చి చంపారు. సిద్దూ మూసావాలా హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు ప్రియవ్రత్ అలియాస్ ఫౌజీ, కాశీష్, కేశవ్ లకు ఉగ్ర గ్రూపు లకు మద్య బలమైన సంబంధాలు ఉన్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ గతంలోనే వెల్లడించారు. వీరి బందాన్ని ఐఎస్ఐ ఉపయోగించుకుంటోందని ఆయన చెప్పారు.

Late Sidhu Moose Wala

 

దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా జైళ్లలో ఉండి తమ కార్యకలాపాలను సాగిస్తొన్న వారిని కట్టడి చేసేందుకు ఎన్ఐఏ ఈ దాడులు చేస్తొంది. కెనడా నుండి సిద్దూ మూసేవాలా హత్యకు పథక రచన చేసిన గోల్డీ బ్రార్ పైనా ఎన్ఐఏ దృష్టి పెట్టింది. అలానే ఆయుధాల అక్రమ రవాణా చేసేవారిపైనా ఎన్ఐఏ దృష్టి సారించింది. నీరజ్ బవానా, అతని గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులే టార్గెట్ గా హత్యలకు పాల్పడుతోందనీ, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తొందని ఎన్ఐఏ పేర్కొంది. ప్రస్తుతం గ్యాంగ్ స్టర్ లు నీరజ్, లారెన్స్ బిష్ణోయ్ కు మద్య విభేదాలు ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. సిద్దూ మూసేవాలా హత్య జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన మరణానికి లారెన్స్ గ్యాంగ్ పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బారువా ప్రకటించారు.

లారెన్స్, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్ స్టర్ లు దేశంలోని పలు జైళ్లతో పాటు కెనడా, పాకిస్థాన్, దుబాయ్ తదితర దేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన కుట్రదారు లారెన్స్ బిష్ణోయ్ సహా పది మంది నిందితులను జూన్ లోనే అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

తాను చెప్పింది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కేంద్రానికి సీఎం కేసిఆర్ సవాల్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N