Nidhi agarwal: నిధి అగర్వాల్ చేతిలో 9 సినిమాలు..యాక్టింగ్ రాదని కామెంట్ చేస్తే ఇప్పుడు రివర్స్‌లో గట్టి షాకిచ్చింది

Share

Nidhi agarwal: హైదరాబాదీ అయిన నిధి అగర్వాల్ మొదటి సినిమాను హిందీలో చేసి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మున్నా మైఖేల్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన నిధీ అగర్వాల్ అక్కడ డెబ్యూ సినిమాతో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో అక్కినేని నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన సవ్య సాచి సినిమాలో నటించే అవకాశం అందుకొని టాలీవుడ్‌లో ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయినా నిధికి నాగ చైతన్య తమ్ముడు అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ఞు సినిమాలో అవకాశం అందుకుంది.

nidhi-agarwal in 9 movies
nidhi-agarwal in 9 movies

అయితే తెలుగులో నిధి అగర్వల్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. వాస్తవంగా తెలుగులో ఒక సినిమా ఫ్లాపయితే రెండవ సినిమాలో అవకాశం దక్కడం కష్టం. అలాంటిది రెండు సినిమాలు ఫ్లాపయితే ఇక పట్టించుకుంటారా. కానీ నిధికి పూరి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నిధికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. పూరి హీరోయిన్స్‌ని ఎంతగా చూపిస్తారో అందరికీ తెల్సిందే. నిధిని ఆయన స్టైల్లో గ్లామర్‌గా చూపించడమే కాకుండా సాలీడ్ హిట్ కూడా ఇచ్చారు.

Nidhi agarwal: తొమ్మిది సినిమాలకి డబ్బింగ్ చెబుతున్నట్టు చెప్పి అభిమానులకి షాకిచ్చింది.

దాంతో నిధి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. కానీ వరుసగా పెద్ద హీరోల సినిమాలలో అవకాశం దక్కలేదు. కానీ లక్కీగా కోలీవుడ్‌లో రెండు సినిమాలలో నటించే అవకాశం అందుకొని తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన రెండు తమిళ సినిమాలు హిట్ సాధించాయి. ఇప్పుడు తమిళంలో మరో రెండు మూడు సినిమాలు చేస్తోందట. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా హరి హర వీరమల్లులో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే గల్లా అశోక్ డెబ్యూ సినిమా హీరో లోను ఆమె హీరోయిన్.

అందరికీ తెలిసి తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు అని అనుకుంటున్నారు. కానీ ఇటీవల ఆమె నెటిజన్స్‌తో తొమ్మిది సినిమాలకి డబ్బింగ్ చెబుతున్నట్టు చెప్పి అభిమానులకి షాకిచ్చింది. ఈ మాట చెప్పినప్పటి నుంచి నిధి తొమ్మిది సినిమాలు ఏవేవి చేస్తుందో అని ఆలోచనలో పడ్డారు. అయితే నిధి ఏఏ భాషలో ఈ తొమ్మిది సినిమాలు చేస్తుంది అనేది ఆమె వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా, గల్లా అశోక్ సినిమా చేస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సినిమాలో అవకాశం అందుకుందని ఆ మధ్య వార్తలు వస్తున్నాయి.

Nidhi agarwal: ఇన్ని సినిమాలు మరో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ కూడా చేయడం లేదు.

కన్నడలో రెండు సినిమాలు చేస్తోందని సమాచారం. అలాగే మొదటి సినిమా చేసిన బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం అందుకుందని అంతక ముందే వార్తలు వచ్చాయి. అది కూడా స్టార్ హీరో సరసన అని తెలుస్తోంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో కలిపి నిధి చెప్పినట్టు తొమ్మిది సినిమాలు చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చినందుకు నిధి స్టార్ హీరోయిన్ కావడం కష్టమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే నిజంగా షాకే. ఇన్ని సినిమాలు మరో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ కూడా చేయడం లేదు.

 


Share

Related posts

న‌టి సురేఖా వాణి భ‌ర్త క‌న్నుమూత

Siva Prasad

`ఆర్ఆర్ఆర్` విడుద‌ల తేదీ మార‌నుందా?

Siva Prasad

ఆర్ఎస్ ఎస్ సంకల్ప్ రథయాత్ర ప్రారంభం

Siva Prasad