Nidhi agarwal : రెమ్యునరేషన్ విషయంలో షాకిస్తోన్న నిధి అగర్వాల్

Share

Nidhi agarwal : నిధి అగర్వాల్  కి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే తన రెమ్యునరేషన్. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ హైదరాబాద్ బ్యూటీ మున్నా మైఖేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ మేకర్స్ నిధి అగర్వాల్‌కి అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచినా మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ హీరోతోనే రెండవ సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ఞు సినిమాలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

nidhi-agarwal is giving shock regarding remuniration
nidhi-agarwal is giving shock regarding remuniration

అయితే ఇండస్ట్రీలో మంచి స్టార్ డం వచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. రాం హీరోగా నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఆ రెండు సినిమాలతో ఈమెకి కోలీవుడ్ ప్రేక్షకులను బాగా కొట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ సినిమాలో హీరోయిన్ గా నటించే గొప్ప అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అవకాశం రాగానే అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో పాటు గల్లా అశోక్ నటిస్తున్న డెబ్యూ సినిమాలో కూడా నటిస్తోంది.

Nidhi agarwal : హరి హర వీరమల్లు సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

అయితే ప్రస్తుతం నిధి అగర్వాల్‌కి తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయట. దాంతో అమ్మడు బాగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక్కో సినిమాకి కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి మేకర్స్ అందుకు సరే అంటున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా తమిళంలో మాత్రం ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

Manchu family : మంచు ఫ్యామిలీ హోప్స్ అన్నీ ఆ రెండు సినిమాల మీదేనా..!

GRK

బన్నీ… గోవిందం అవుతాడా?

Siva Prasad

లైగర్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మార్చేనా ..?

GRK