Simbu: తమిళ హీరో శింబు గురించి చెప్పుకుంటే కాస్త క్రేజీగా ఉంటుంది. అతగాడి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఇక శింబు ప్రేమ కధలు గురించైతే చెప్పనవసరం లేదు. బేసిగ్గా తమిళ హీరో అయినటువంటి శింబు ‘మన్మధ’ అనే సినిమాతో తెలుగునాట కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. అయితే అంటే స్పీడులో ఇక్కడ మార్కెట్ కోల్పోయాడు కూడా. దాదాపు ఓ దశాబ్దం నుండి శింబుని విజయం వరించడం లేదు. ఈ క్రమంలో ప్రేమించిన ప్రియురాళ్లని కూడా దూరం చేసుకున్నాడు.
Tamil Bigg Boss: తమిళ్ బిగ్ బాస్ షోలో కమల్ హాసన్ ప్లేస్ రిప్లేస్ చేసిన ఆ స్టార్ హీరో.!!
Simbu: శింబు తాజా ప్రేమ కహాని:
ఇక అసలు విషయానికొస్తే, మన తెలుగు హీరోయిన్ అయినటువంటి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరియు శింబు డీప్ లవ్‌లో వున్నారని సినీ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నాయి. కొంతకాలంగా వీరి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ వేదికని, అలాగే తేదీని కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
Ananya Panday: గ్లామర్ షోతో గుబులు రేపుతున్న `లైగర్` భామ.. వామ్మో ఇంత అరాచకమా!
అభిమానుల ఆందోళన!
ఇదిలా ఉంటే, మన హీరోయిన్ సో కాల్డ్ అభిమానులకు ఈ ప్రేమ వ్యవహారం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకనగా శింబు గత ప్రేమ యవ్వారాలు తెలిసిన మనవాళ్ళు నిధిని ఈ పెళ్లి చేసుకోవద్దు అన్నట్టుగా సూచనలు చేస్తున్నారట. ఇక ప్రేమైతే గుడ్డిది కాబట్టి ఆ మాట మన ముద్దుగుమ్మ వినే పరిస్థితిలో లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోవడం కొసమెరుపు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.