Niharika: నిర్మాణ రంగంలో మెగా డాటర్స్..ఎంతవరకు సక్సెస్ అవుతారో..?

Share

Niharika: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా అంటే ఇప్పుడు ఓ మహా వృక్షం. మెగాస్టార్ వేసిన బాటలో మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ టాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అభిమానుల కోసం ఎంతైనా కష్టపడే మెగా హీరోలంటే మెగా అభిమానులకు ఉండే ఆ ప్రత్యేకమైన అభిమానం వేరే లెవల్. టాలీవుడ్‌లో ఇంత మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ అభిమానుల మీద అంతే ప్రేమ, అభిమానం చాటుకుంటున్నారు. తమ సినిమాలను అభిమానిస్తున్న అభిమానుల కోసం మెగా హీరోలు ఎప్పుడూ చేయూతనిస్తూనే ఉన్నారు.

niharika-megha daughters in production field
niharika-megha daughters in production field

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు వచ్చిన ప్రతీ హీరో ఓ సపరేట్ ఇమేజ్ సాధించారు. మెగా బ్రదర్ నాగబాబు నటుడుగా, నిర్మాతగా ఆయనకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఇక సునామీ లాంటి పవర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. సినిమాల వరకు పవర్ స్టార్‌గా, జనాలకి జనసేనానిగా పవన్ కళ్యాణ్ సంపాదించుకున్న క్రేజ్ అసాధారణం. ఆ తర్వాత అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ ఇమేజ్‌లను కలిపి సంపాదించుకున్న హీరో రాం చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్ మెగా పవర్ స్టార్‌గా మారాడు.

Niharika: మెగా డాటర్స్ కూడా నిర్మాతలుగా మారి వెబ్ సిరీస్ చేసేస్తున్నారు.

ఇక మేనల్లుడు సాయి ధరం తేజ్ మేనమామ సినిమా పేరుతో సుప్రీమ్ హీరోగా క్రేజ్ సంపాదించుకొని హీరోగా రాణిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ ఇటీవల రెండు సినిమాలతో వచ్చి స్టార్ హీరోగా మారాడు. ఇక అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. శిరీష్ కూడా మంచి సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా క్రేజ్ తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. ఇలా మెగా హీరోలందరూ తమ రేంజ్ సత్తా చాటుతూ ఇండస్ట్రీలో ఓ ప్లేస్ సంపాదించుకుంటే మెగాస్టార్ తనయుడు రాం చరణ్ నిర్మాతగా మారి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మెగా డాటర్స్ కూడా నిర్మాతలుగా మారి వెబ్ సిరీస్ చేసేస్తున్నారు. చరణ్ ఖైదీ నంబర్ 150 మూవీతో నిర్మాతగా మారి సైరా సహా ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాలను ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ సోదరి సుశ్మిత ఒకవైపు కాస్ట్యూంస్ డిజైనర్‌గా చేస్తూనే మరొకవైపు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేసేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు.

Niharika: తాజాగా ఈ టైటిల్ కి అర్థం ఏంటో నిహారిక వెల్లడించారు.

ఇదే క్రమంలో మెగా బ్రదర్ నాగ బాబు కుమార్తె నటి,యాంకర్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘ఓసీఎఫ్ఎస్’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ టైటిల్ కి అర్థం ఏంటో నిహారిక వెల్లడించారు. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అర్థం. మంచి టైటిల్‌తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19 నుంచి మొదలవబోతోంది. మొత్తం 5 ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ కానున్న ‘ఓసీఎఫ్ఎస్’ మెగా డాటర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన సర్వే..!!

sekhar

Job Notification: బెల్ నోటిఫికేషన్..!!

bharani jella

Etela Rajendar Comments: నన్ను చంపడానికి చూసారు.. ఈటెల సంచలన కామెంట్స్..!

Srinivas Manem