శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకొచ్చిన యంగ్ హీరో నిఖిల్. ఈ సినిమా సక్సస్ తో టాలీవుడ్ లో బాగా సెటిలయ్యాడు. గత కొంతకాలంగా సక్సస్ లు లేని ఈ యంగ్ హీరో రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు.
దీంతో మళ్ళీ వరసగా సైనిమాలో లైన్లో పెట్టాడు. ప్రస్తుతం నిఖిల్ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న కార్తికేయ 2. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా స్వాతి మళ్ళీ చాలా కాలం తర్వాత కార్తికేయ 2 లో నటించబోతుందని సమాచారం. ఇక మరోటి ’18 పేజెస్’. ఈ సినిమాలో నిఖిల్ మెమరీ లాస్ సమస్యతో బాధ పడే యువకుడిగా నటిస్తున్నాడట.
‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా దర్శకుడు సుకుమార్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటించబోతుందని తాజా సమాచారం. జూన్ 15 నుంచి షూటింగ్స్ కి పర్మిషన్ వస్తే నిఖిల్ ఒకేసారి కార్తికేయ 2, ’18 పేజెస్’ ని సెట్స్ మీదకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలు 2021 లో రిలీజ్ చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట.