Nikhil : టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ ఒకరు. ఆయన కార్తికేయ, స్వామీ రారా లాంటి సినిమాలతో మంచి క్రేజీ హీరోగా మారాడు. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో రెమ్యూననరేషన్ కూడా నిఖిల్ కి బాగానే ఆఫర్ చేశారు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ నిఖిల్ ని డౌన్ ఫాల్ అయ్యేలా చేశాయి. మళ్ళీ కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు. దాంతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. పెళ్ళి కూడా చేసుకున్న నిఖిల్ మ్యారీడ్ లైఫ్ కూడా చక్కగా ఆస్వాదిస్తున్నాడు.
ఇక అల్లు అరవింద్ సమర్పణలో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. జీఏ2 బ్యానర్ మీద బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. అలాగే కార్తికేయ 2 చేస్తున్నాడు. ఇందులో కూడా అనుపమ హీరోయిన్ అవగా పార్ట్ 1 తెరకెక్కించిన చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు గనక సూపర్ హిట్ అయితే ఇక నిఖిల్ కి ఢోకా ఉండదనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
Nikhil : నిఖిల్ మూడు సినిమాలను అంగీకరించాడట.
ఐతే తాజా సమాచారం తో నిఖిల్ మరో మూడు సినిమాలను అంగీకరించాడట. త్వరలో ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయని తెలుస్తోంది. కాగా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఎంతో మంది కష్టంతో ఉన్నారు. వారికి సేవ చేస్తూ తన వంతు సహాయాన్ని అందిస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నాడు. సోనూ సూద్ తర్వాత అంతగా ప్రతీ విషయంలో స్పందిస్తుంది ఈ యంగ్ హీరోనే. పెద్ద స్టార్ హీరోలందరికీ నేనున్నాంటూ ముందుకొచ్చి తన అభయ హస్తాన్ని ఇస్తున్నాడు. బయట వారి నుంచి విరాళాలు సేకరించకుండానే, తన సొంత డబ్బు తో బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటున్నాడు.