Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా 18 పేజెస్ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి సిద్దు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. అలాగే 18 పేజెస్ టీమ్ నిఖిల్ కు కొన్ని సర్ప్రైజ్స్ ఇచ్చింది అవేంటో ఇప్పుడు చూద్దాం.. అలాగే నిఖిల్ ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ తో మాట్లాడిన వీడియోను విడుదల చేశారు..

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని GA2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పెద్ద బ్యానర్ ను టెర్రస్ పైనుంచి నుంచి కిందకి కనిపించేలా పెద్ద వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.. అలాగే కే.ఏ సినిమా మా ఫస్ట్ లుక్ తో కేకును తయారుచేసి నిఖిల్ సిద్ధార్థ్ ను సర్ప్రైజ్ చేశారు..
A small surprise to @actor_Nikhil from Team #18Pages ? #HappyBirthdayNikhil ?#AlluAravind @aryasukku @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli #BunnyVas @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/fK6ZUS9ugY
— Vamsi Kaka (@vamsikaka) June 1, 2021
ఈరోజు నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిఖిల్ ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ తో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో 16 మంది అమ్మాయిలతో మాట్లాడడం మరో ప్రత్యేకత.. వారితో నికి కరోనా జాగ్రత్తలు అందరూ పాటించాలి మీరు కూడా చెప్పండి, అలాగే తోటివారికి సహాయం చేసేలా వారిని మోటివేట్ చేయండి అంటూ వారికి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు, తనకు నచ్చిన పలు అంశాలను ఈ వీడియోలో వారితో కలిసి చర్చించారు.