NewsOrbit
న్యూస్ సినిమా

పప్పులో కాలేసిన నిఖిల్.. కార్తికేయ 2 సినిమాకి పెద్ద మైనస్??

‘థాంక్యూ’ సినిమా జులై 22న రిలీజ్ అయింది. ఆ సినిమా కోసం తమ రిలీజ్ డేట్ ని ఏకంగా 20 రోజులు వాయిదా చేసుకుంది ‘కార్తికేయ- 2’ టీమ్. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. థాంక్యూ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. నిన్న చాలా చోట్ల థియేటర్లలో చైతు సినిమా క్యాన్సిల్ అవుతుందేమో అని అనుమానం కలిగిందంటే అక్కడ ఈగలు తప్ప ప్రేక్షకులు కూడా లేదని చెప్పవచ్చు. వీకెండ్ పూర్తయినప్పటికీ మూడు రోజులకి కనీసం నాలుగు కోట్లు అయినా రాకపోవడం అనేది మరీ దారుణం. ప్రేక్షకులు ఫస్ట్ మూవీ రివ్యూ చూసుకొని, రివ్యూ బాగుంటేనే సినిమా చూడడానికి వెళ్తున్నారు.లేకపోతే ప్లాప్ అయ్యే మూవీకి మనీ ఎందుకు దండగ అని రెస్టారెంట్‌కో, పార్క్ కో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

అన్నీ మూవీలు ప్లాపులె

ఇంకోపక్కా రణ్ బీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ మూవీ కూడా దారుణంగా ఉండటంతో ఆ సినిమా థియేటర్ల వైపు చూడటమే మానేసారు ప్రేక్షకులు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఈ సినిమా కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. కానీ షంషేరా సినిమా కనీసం రూ.40 కోట్లను తెస్తుంది? అనేది ప్రశ్నార్థకమే. చాలా చోట్ల థియేటర్ల అద్దెకు కావాల్సిన డబ్బులు కూడా వసూలు కాలేదు. గతవారం వచ్చిన ‘ది వారియర్’ మూవీ కూడా  చేతులెత్తేయడంతో ఏ సినిమాకి కూడా పోటీ లేకుండా పోయింది.

ఛాన్స్ మిస్ చేసుకుంది

ఇదే సమయంలో ‘కార్తికేయ 2’ సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేది. నిజానికి థాంక్యూ సినిమా రిలీజ్ అవుతుందని కార్తికేయ 2 సినిమాని ఆగస్టు 12కి వాయిదా వేసుకున్నారు. కానీ థాంక్యూ సినిమా అనూహ్యంగా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ టీమ్ ఒక సువర్ణావకాశం పోగొట్టుకున్నట్లు అయ్యింది. అలానే వాయిదా వేసుకోవడం పెద్ద మైనస్ గా మారింది. ఎందుకంటే ఆగస్ట్ 12న మాచర్ల నియోజకవర్గం రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ చేయడం, పోస్టర్స్ మాస్ యాంగిల్ లో ఉండటం సగటు ప్రేక్షకుడిలో ఆసక్తి పెంచుతున్నాయి. దానికి ముందురోజు ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ రాబోతుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ను రాబట్టేలా ఉంది. కార్తికేయ 2 టీమ్ వెరైటీ గా నిఖిల్ ని చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ లో హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న డేట్ ప్రకారం విడుదల చేసినట్లయితే మూవీకి మినిమమ్ గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కాంపిటేషన్ గట్టిగానే ఉందని తెలుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju