NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ గేమ్ షురూ…! ఆ 9 మందిని ఎన్నికల విధుల నుండి తొలగింపు…?

మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం బాగా రసవత్తరంగా మారింది. ఏపీ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఒక్కసారిగా జోరు పెంచేశారు. ఇక ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది కాబట్టి అందుకు అధికారులు కావాలని ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదని ముందు హై కోర్టుకు అప్పీలు చేసింది. వారి వాదనలను అంగీకరించిన హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ పై స్టే ఇవ్వాలని నిర్ణయించారు.

 

దూకుడే… దూకుడు

అయితే ఎన్నికలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలి అన్న పట్టుదలతో మళ్లీ పిటిషన్ వేసిన ఎస్ఈసి చివరికి జగన్ ప్రభుత్వం పై చేయి సాధించింది. ఇక ఈ విషయంలో హైకోర్టు నిర్ణయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఇక ఇదే క్రమంలో ఏపీ ఎస్ఈసీ ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఒక లేఖ రాశారు. ఎన్నికల విధుల నుండి తొమ్మిది మంది అధికారులను తొలగించాలని సూచించారు.

అప్పుడే ఫిక్స్ అయ్యాడు

వారు పంపిన లిస్టులో తిరుపతి అర్బన్ ఎస్పీ తోపాటు పలమనేరు, శ్రీకాళహస్తి డిఎస్పీలు…. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు… మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సిఐ లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఎస్ ఎస్ సి లేఖలో కోరింది. ఇంతకీ వీరు చేసిన తప్పు ఏమిటంటే… గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఈ తొమ్మిది మంది కావాలని అలసత్వం ప్రదర్శించారని…. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక గతంలో వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిమ్మగడ్డ అప్పుడే లేఖ రాసినట్లు గుర్తు చేశారు.

సుప్రీం కోర్టు పైనే భారం

ఇప్పుడు వీరిని విధుల నుండి తొలగించక పోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. అయితే జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ అతను మాత్రం వీరందరిని వెంటనే రేపటినుండి విధుల నుంచి తొలగించాలని సూచించారు. మరొకవైపు సుప్రీం కోర్టు ద్వారా అయినా ఈ ఎన్నికల ప్రక్రియ ను నిరోధించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. సుప్రీంకోర్టులో తమకు ప్రతికూలంగా నిర్ణయం వస్తే మాత్రం నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరొక దారి ఉండదు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju