NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : వరుస పెట్టి 1 2 3 మూడు దారుణమైన దెబ్బలు కొట్టిన నిమ్మగడ్డ – జగన్ ప్రభుత్వం కూదేలు

Nimmagadda : ఏపిలో వైసీపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఎస్ఈసీ వ్యాహాలకు దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యూహ ప్రతి వ్యూహాలతో వేస్తున్న అడుగులు ఏపి రాజకీయ వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ ల స్వీకరణ పర్వం ప్రారంభం అయిపోయింది. అధికార వైసీపీ ఏకగ్రీవాలపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల్లోకి వెళ్లకుండానే అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవాల ద్వారా తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకగ్రీవ పంచాయతీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేశారు. మంత్రులు ఈ పాటికే వైసీపీ ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు ఎక్కువగా చేయాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చేశారని టాక్.

Nimmagadda : Nimmagadda beaten 3 out of 3 in a row - Jagan government coup
Nimmagadda Nimmagadda beaten 3 out of 3 in a row Jagan government coup

YS Jgan : జగన్ సర్కార్ లోని కీలక ఐఎఎస్ లపై చర్యలు

ఇదిలా ఉంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాల ద్వారా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రధానంగా జగన్మోహనరెడ్డి సర్కార్ లో కీలక అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూ జగన్ కు అత్యంత సన్నిహిత అధికారులుగా ఉన్న వారిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ దృష్టి పెట్టారు. ఇప్పటికే అటువంటి అధికారులను గుర్తించి వారందరినీ బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా జగన్ కు అత్యంత సన్నిహతుడైన అధికారిగా పేరున్న సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పైనా ఫోకస్ పెట్టారు. ఎన్నికల విధుల నుండి ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాయడం అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Nimmagadda : ప్రభుత్వంపై కోర్టు దిక్కార పిటిషన్

రెండు రోజుల క్రితం ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుండి తప్పించాలని లేఖ రాశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుండి తొలగించాలంటూ గవర్నర్ కు లేఖ రాశారు. అదే లేఖలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ను ఆశ్రయించనున్నట్లు కూడా తెలిపారు. మరో విషయం ఏమిటంటే హైకోర్టులో ప్రభుత్వంపై కోర్టు దిక్కార పిటిషన్ నూ దాఖలు చేశారు. ఎస్ఈసీకి సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం సహకరించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలా వరుసపెట్టి జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ దెబ్బలు మీద దెబ్బలు తీస్తున్నారు. ఈ పరిణామాలు జగన్మోహనరెడ్డి సర్కార్ కు తీవ్ర ఇబ్బందిని కల్గిస్తున్నాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N