NewsOrbit
న్యూస్

ఏపీ మాజీ మంత్రులతో నిమ్మగడ్డ రహస్య భేటీ..! వెనుక ఉన్నది అతనే… దాని కోసమే ఇదంతా?

Share

గత కొద్ది రోజుల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుట్రపూరితంగానే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఆదేశాలు మేరకు వాయిదా వేశారని అప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేసి…. అతని స్థానంలో వేరొకరిని నియమించిన విషయం కూడా తెలిసిందే. కానీ చివరికి హైకోర్టు వారు నిమ్మగడ్డనే మళ్ళీ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా నియమించమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

 

తర్వాత ఆ హడావిడి అంతా సద్దుమణిగింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ మాజీ మంత్రి అరెస్టులే హాట్ టాపిక్. ఇటువంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 13వ తేదీన బిజెపి నాయకులు మరియు ఏపీ మాజీ మంత్రులు అయిన సుజనా చౌదరి (రాజ్యసభ సభ్యుడు) మరియు కామినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ మీటింగ్ కూడా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే జరగడం…. ఇంకా వీరు ముగ్గురు వేర్వేరు సమయాల్లో హోటల్ లోనికి అడుగు పెట్టి వేర్వేరు లిఫ్టుల్లో పైకి చేరుకొని… చివరికి అంతా ఓకే రూమ్ లోనికి వెళ్ళడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు వీరి ముగ్గురి రహస్య భేటీ వెనుక చంద్రబాబు హస్తం ఉంది అని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. 

అంతేకాకుండా చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికలు జరగకుండా ఆపడం మరియు మండల మెజారిటీని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ బిల్లులు పాస్ కాకుండా నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని… ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వైసీపీ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరి ఈ భేటీకి సంబంధించి అసలు వివరణ ఇచ్చేది ఎవరు? నిమ్మగడ్డా? సుజనాచౌదరి నా? లేక శ్రీనివాసరావా? లేకపోతే అసలు సూత్రధారి అని చెప్పబడుతున్న చంద్రబాబా?


Share

Related posts

ప్రభాస్ లాగా హీరోయిన్ లలో ఎన్నాళ్లు ఐనా పెళ్లి చేసుకొని అమ్మాయిలు వీళ్ళే

Naina

RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకి ఆచార్య వెనక్కి తగ్గుతున్నాడా..?

GRK

రామ్ తో నెక్స్ట్ సినిమా చేసేది అందరు అనుకున్న వాళ్ళు కాదు.. ఇది చాలామందికి షాకే ..?

GRK